Big Boss 6 Geetu Royal : బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్.. ఆ ఎపిసోడ్స్ చూస్తూ గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న గీతూ రాయల్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్బాస్ సీజన్ 6 లో గీతు రాయల్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే మొదటి నుంచి టైటిల్ గెలవాలి అన్న ఆశయంతో టాస్కులలో, గేమ్ ల విషయంలో కష్టపడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.కానీ చివరి రెండు వారాలలో ఆమె ప్రవర్తన బాగో లేకపోవడంతో ఆమె ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశారు.

అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు పాజిటివిటి తో వెళ్ళిన గీతూ బయటకు వచ్చేటప్పుడు బోలెడంత నెగిటివిటీని మూటగట్టుకుని బయటకు వచ్చింది.ఇదే బిగ్ బాస్ అంటే పడి చచ్చే గీతూ ఇలా ఊహించిన విధంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేయడం అన్నది ఆమెకు ఇప్పటికీ షాకింగ్ గానే ఉంది.

కాగా ఓవర్ కాన్ఫిడెంట్ గీతూ ఆటకు ఆటంకం కలిగించింది అని చెప్పవచ్చు.దీంతో ఊహించని విధంగా బయటికి ఎలిమినేట్ అయి వచ్చేసింది.

Advertisement

టాప్ ఫైవ్ లో ఉంటుంది అనుకున్న గీతూ టాప్ 10 లో కూడా లేకుండా ఎలిమినేట్ అయింది.అయితే ఇప్పటికి గీతూ ఎలిమినేట్ అయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ తో ఏడిపించు బిగ్ బాస్ అంటూ సవాల్ విసిరిన గీతూ ఇప్పుడు ఎలిమినేట్ అయిన తర్వాత ప్రతిరోజు ఏడుస్తూనే ఉంది.తాజాగా గీతు బిగ్ బాస్ షో చూస్తూ మరొకసారి ఏడ్చేసింది.

బిగ్బాస్ హౌస్లో ప్రస్తుతం 12 వ వారం ఫ్యామిలీ వీక్స్ సందర్భంగా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుండడంతో అది చూసి తట్టుకోలేకపోయిన గీతూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇదే వీడియోని గీతూ భర్త వికాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.అందుకు సంబంధించిన వీడియో ని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చాడు.గీతూ ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం చాలా కలలు కనింది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

షోలు కి వెళ్ళకముందే వాళ్ళ అమ్మకి చీర కొనిచ్చి దాన్ని కట్టుకు రమ్మని చెప్పింది.కానీ ఊహించిన విధంగా ఎలిమినేషన్ జరగడం అన్నది తనతో పాటు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము.

Advertisement

ఫ్యామిలీ థీమ్ లో వాళ్ళ అమ్మను బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుంది.అని ఇప్పుడు ఆ ఎపిసోడ్ చూసేటప్పుడు వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుని చాలా ఏడుస్తోంది.

మేమంతా గీతూ తో ఉన్నాం.మీరు కూడా ఉంటారు అనుకుంటున్నాం అని రాసుకొచ్చాడు గీతూ భర్త వికాస్.

తాజా వార్తలు