తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మరో వారం పూర్తి చేసుకుంది.ఇప్పటి వరకు 9 వారాలు జోరుగా సాగుతున్న ఈ షో కు మరింత బూస్ట్ ను ఇస్తూ ఈ వారం నాగార్జున శనివారం ఎపిసోడ్ లో దుమ్ము రేపాడు.
అసలు ఏం మనిషివి అంటూ సన్నీని ప్రశ్నించిన తీరు ఏం జరిగిందా అంటూ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.సన్నీని ఎందుకు నాగార్జున అలా అన్నాడు అంటూ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరు కూడా షో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు ఈ షో కు సంబంధించిన లీక్ బయటకు వచ్చింది.ప్రతి శనివారం సాయంత్రంకు ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటూ క్లారిటీ వచ్చేస్తుంది.
ఈ వారం కూడా లీక్ వచ్చేసింది.అతి తక్కువ ఓట్లు వచ్చిన లోబోను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపించాలని ఓటర్లు నిర్ణయించారు.
కాని అనూహ్యంగా లోబోకు మళ్లీ అవకాశం దక్కింది.అద్బుతమైన అవకాశం అన్నట్లుగా ఈ వారం ఎలిమినేషన్ లేదు అంటూ తేల్చి చెప్పాడు.

బిగ్ బాస్ ను 100 రోజులు రన్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ ను వారంకు ఒకరు చొప్పున ఎలిమినేట్ చేస్తే కష్టం.చివరకు అయిదుగురు మిగలాలి.కాని ఈసారి వైల్డ్ ఎంట్రీ తీసుకోలేదు కనుక ఖచ్చితంగా బిగ్ బాస్ లో రెండు వారాల పాటు ఎలాంటి ఎలిమినేషన్ ఉండకూడదు అంటూ బి బి నిర్వాహకులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి ఈ వారం కూడా లోబో బచాయించాడు.
గత వారం మొత్తం బిగ్ బాస్ లో లోబో పెద్దగా కనిపించలేదు.రవితో ఎక్కువగా ఉండే లోబో ఎందుకు దూరంగా ఉంటున్నాడు అనేది తెల్సిందే.
కన్ఫెషన్ రూమ్ లో లోబో మాట్లాడిన మాటలు ఇంటి సభ్యులు విన్నారు.దాంతో అతడిపై అందరు కూడా కోపం కోపంగా ఉన్నారు.
అందుకే బిగ్ బాస్ లో ఈ వారం ఆయన కనిపించలేదు అంటున్నారు.మునుపటి మాదిరిగా యాక్టివ్ గా కూడా లేదు.
అందుకే లోబో వెళ్తాడు అంటున్నారు.లోబో వెళ్లే అవకాశాలు ఈ వారం ఎక్కువ ఉన్నా కూడా ఎలిమినేషన్ లేదని క్లారిటీ ఇచ్చారు.
దాంతో బిగ్ బాస్ నుండి లోబో ఎలిమినేషన్ ఒక వారంకు వాయిదా పడ్డట్లయ్యింది.