శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ఎదురుదెబ్బ తగిలింది.విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు( AP High Court) నిరాకరించింది.
ఈ క్రమంలోనే ఫిర్యాదుదారులను ప్రతి వాదులుగా చేర్చాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను మే మొదటి వారానికి వాయిదా వేసింది.
అయితే 28 ఏళ్ల క్రితం దళిత యువకులకు శిరోముండనం చేయించిన కేసులో తోట త్రిమూర్తులను దోషిగా నిర్ధారిస్తూ విశాఖ కోర్టు ఈ నెల 16న సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయనకు 18 నెలల జైలు శిక్షను కూడా విధించింది.
విశాఖ కోర్టు( Visakhapatnam court) ఇచ్చిన తీర్పును తోట త్రిమూర్తులు ( Thota Thrimurthulu)హైకోర్టులో సవాల్ చేవారు.జైలు శిక్షపై స్టే విధించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.మరోవైపు మండపేట అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఉన్న తోట త్రిమూర్తులను మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.







