బీసీసీఐ అధ్యక్షుడు మాజీ క్రికెటర్ ఒకప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ గుండెపోటుతో అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.డిసెంబర్ నెలలో ఆల్రెడీ ఒకసారి గుండెపోటుతో గంగూలీ జాయిన్ అయిన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కోకోల్ కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

మొదటిసారి హాస్పిటల్లో జాయిన్ అయిన తరుణంలో వైద్యులు గంగూలీ కి ఏంజియోప్లాస్టీ నిర్వహించారు. అవసరమైతే మరోసారి ఏంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని అప్పట్లో వుడ్ లాండ్స్ వైద్యులు సూచించారు.గతసారి సర్జరీ అనంతరం సౌరబ్ త్వరగా కోలుకోవటం తో ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు ఎంతగానో సంతోషించారు.
అయితే ఆ సర్జరీ జరిగి ఒక నెల కూడా అవ్వకముందే రెండోసారి మళ్లీ గుండెనొప్పితో గంగూలీ హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తోంది.గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు భగవంతుని కోరుకుంటున్నారు.