Nara Bhuvaneswari : వైసీపీ ప్రభుత్వంపై భువనేశ్వరి సీరియస్ వ్యాఖ్యలు..!!

రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలోని గోపులాపురం గ్రామంలో బుధవారం టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ) పర్యటించడం జరిగింది.

ఆల్రెడీ ఈ విషయానీ టీడీపీ పార్టీ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది.

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన కుటుంబాలను నిజం గెలవాలి( Nijam Gelavali ) యాత్ర పేరిట భువనేశ్వరి పరామర్శిస్తూ ఒక్కో కుటుంబానికి మూడు లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక కుటుంబాలను పరామర్శించి వారిని ఒదరుస్తున్నారు.

ఎన్నికల సమీపిస్తున్న వేళ మరింతగా ఈ కార్యక్రమాన్ని ముగించే రీతిలో విస్తృత పర్యటనలు చేపడుతున్నారు.ఈ క్రమంలో బుధవారం సాయంత్రం గోపాలపురం, కళ్యాణదుర్గంలో భువనేశ్వరి పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టు( Chandrababu Arrest ) తట్టుకోలేక మరణించిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం( YCP Govt )పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 33వేల ఎకరాలు ఇస్తే.రాజధాని ఇది అని చెప్పుకోవడానికి లేకుండా చేశారని అన్నారు.

Advertisement

వైసీపీ ప్రభుత్వం సచివాలయం సహా అన్నీ తాకట్టుపెట్టిందని ఆరోపించారు.చంద్రబాబు ఎప్పుడూ అవినీతి చేయలేదు, చేయరని.

తప్పు చేయని వ్యక్తిని జైలులో పెట్టారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు