తెలుగులో ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున తదితర స్టార్ హీరోల సరసన నటించి ఎంతగానో ఆకట్టుకున్న తెలుగు హీరోయిన్ “భూమిక చావ్లా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా నటి భూమిక చావ్లా తెలుగు, తమిళం, హిందీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.
కానీ ఆ మధ్య భరత్ ఠాకూర్ అనే ఓ ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని దాదాపుగా మూడు సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంది.ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది.
అంతేకాకుండా హీరోయిన్ గా అవకాశాలను కూడా దక్కించుకోలేక పోయింది.
అయితే ఈ మధ్య కాలంలో నటి భూమిక చావ్లా సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.
ఇందులో భాగంగా సముద్రపు ఒడ్డున బీచ్ లో తన కొడుకుతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసినటువంటి ఫోటోను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.అంతేకాకుండా ఈ ఫోటోలకి జీవితంలో చిన్న చిన్న సంతోషాలు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలని క్యాప్షన్ కూడా పెట్టింది.
దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ జీవితంలో ప్రతి విషయాన్ని ఆస్వాదించాలనే విషయం చాలా కరెక్ట్ గా చెప్పారని రిప్లై మెసేజ్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం “భూమిక చావ్లా” తెలుగులో దాదాపుగా రెండు చిత్రాలలో నటిస్తోంది.ఇందులో శ్రీకాంత్ మరియు యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా నటిస్తున్న “ఇది మా కథ” అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపుగా పూర్తి చేసినట్లు సమాచారం.
అలాగే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “సంపత్ నంది” మరియు యాక్షన్ హీరో “గోపీచంద్” ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “సీటీమార్” అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.