పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తెలంగాణలో ఈ సినిమా రికార్డులు స్థాయిలో ఓపెనింగ్ వసూళ్లు దక్కించుకుంది.
ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అత్యధిక వసూళ్లను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.బాహుబలి ని మించి ఈ సినిమా వసూళ్లు దక్కించుకుంది అంటూ ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
తెలంగాణలో భారీ ఎత్తున టికెట్ రేట్లు ఉన్న కారణంగా అత్యధికంగా వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇదే సమయంలో ఏపీలో మాత్రం అత్యంత దారుణమైన వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ విశ్లేషకులు అంటున్నారు.
నైజాం ఏరియా లో ఏకంగా 12 కోట్ల వరకు వసూలు వచ్చాయి.ఏపీలో నైజాం కి మించి వసూలు రావాల్సి ఉంది.
ఏపీ మరియు సీడెడ్ కలిపి కూడా 14 కోట్ల వసూళ్లు దక్కించుకోలేక పోయింది అంటూ టాక్ వినిపిస్తుంది.సాధారణంగా అయితే ఇక్కడ అక్కడ ఒకే రకమైన టికెట్లు ఉంటే నైజాం ఏరియాలో పది కోట్లు వస్తే ఏపీ మరియు సీడెడ్ కలిపి మొత్తంగా 16 నుండి 17 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది.
కానీ ఈసారి దాదాపుగా నైజాం ఏరియా కు సమానమైన వసూలు వచ్చాయి.ఈ లెక్కన చూసుకుంటే నైజాం ఏరియా లో వచ్చిన కంటే ఏపీలో తక్కువ వసూళ్లు నమోదు అయినట్లే తక్కువే.
టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉండడం వల్లే ఈ పరిస్థితి ఉందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా ఈ సినిమా ఏపీలో పాతిక కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యం లో రెండు వారాల పాటు కచ్చితంగా మంచి వసూళ్ల ను దక్కించుకునే అవకాశం ఉంది.ఈ రెండు వారాలు కూడా టికెట్ల రేట్ల ను పెంచకుంటే ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ ను గట్టి దెబ్బ కొట్టినట్లే అంటూ ట్రేడ్ పండితుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.