దొంగల భీభత్సంతో డబ్బు పోగొట్టుకున్న సౌందర్య.. ఏమైందంటే..?

దాదాపు 12 సంవత్సరాలుగా నటిగా వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ సౌందర్య తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఒక విమాన ప్రమాదంలో సౌందర్య మరణించగా అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే సౌందర్య ఎక్కువగా ఎంచుకున్నారు.

సౌందర్య తెలుగులో విక్టరీ వెంకటేష్ కు జోడీగా ఎక్కువ సినిమాల్లో నటించగా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.నటిగానే కాక కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఆదుకున్న మంచి వ్యక్తిగా సౌందర్య మంచి పేరును సొంతం చేసుకున్నారు.

కేవలం 12 సంవత్సరాలే సినిమాల్లో నటించినప్పటికీ సౌందర్య ఏకంగా ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను అందుకోవడం గమనార్హం.అయితే ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వర్ణక్క తన జీవితానికి మలుపు తిప్పిన సినిమా అని తెలిపారు.

అంతఃపురం సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మారుషయాస్ ప్రాంతానికి ఆ సినిమా షూటింగ్ కోసం వెళ్లామని మా రూముల్లో దొంగలు పడ్డారని సౌందర్య, సాయికుమార్ ఇతర ఆర్టిస్టుల డబ్బులు ఎత్తుకెళ్లిపోయారని తమ్మారెడ్డి అన్నారు.ఆ సమయంలో డబ్బులు లేక ఆకలితో బాధ పడ్డానని శ్రీవాస్ ఆ సమయంలో 5 డాలర్లు ఉన్నాయని చెప్పి ఆకలిని తీర్చుకున్నామని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

Advertisement

అంతఃపురం సినిమా 8 నంది అవార్డులను అందుకోవడం గమనార్హం.బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.సౌందర్య, సాయికుమార్ కు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.

దర్శకుడు కృష్ణవంశీ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో అంతఃపురం సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.ఆ తరువాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కాగా ఈ మధ్య కాలంలో కృష్ణవంశీకి సరైన హిట్ లేదనే సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు