సాయి పల్లవిపై భజరంగ్ దళ్ సీరియస్.. ఆమె కెరీర్ ఖతమైనట్టేనా?

రానా, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం విరాట పర్వం.ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్న తర్వాత ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అంతేకాకుండా గత ఏడాది కాలంగా ఈ సినిమా విడుదల తేదీలు వాయిదా పడుతూ వస్తున్నాయి.ఇకపోతే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ మూవీ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి.

ఇకపోతే ఇటీవల విడుదల చేసిన టీజర్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.ఈ సినిమాను 90వ దశకంలో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.

Advertisement

నక్సల్ నేపథ్యానికిఒక అందమైన ప్రేమ కథని జోడించి ఈ సినిమాని రూపొందించారు.ఇకపోతే ఈ సినిమా టైటిల్ కారణంగా వివాదంలో ఇరుక్కుంది.

గత కొన్ని రోజులుగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రచారంలో భాగంగా హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనికశ్మీర్ పండిట్ల హత్యలపై గోవులని తీసుకెళుతున్న బండి డ్రైవర్ ని కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అంటూ అన్నారని కశ్మీర్ పండిట్ల హత్యలకు గోహత్యలకు ఎలాంటి తేడా లేదని సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ టైటిల్ పై విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ విభాగం సీరియస్ అయింది.అంతే కాకుండా సినిమా కథకు టైటిల్ కు ఏమాత్రం సంబంధం లేకుండా సినిమా నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తోందని దీనికి నక్సలిజం కథని జోడించి మహాభారత కథలోని విరాటపర్వాన్ని అవమానించారని తెలిసిందని అభ్యంతరకర అంశాలు వుంటే వెంటనే సినిమా విడుదలని నిలిపివేయాలని సెన్సార్ బోర్డ్ కు భజరంగదళ్ తెలంగాణ కన్వీనర్ యు.రాములు లేఖ రాశారు.అంతే కాకుండా సాయి పల్లవి కశ్మీర్ పండిట్ ల హత్యలపై గో హత్యలపై చేసిన వ్యాఖ్యలని సీరియస్ తీసుకున్న భజరంగ్ దళ్ వారు కోఠి సుల్తాన్ బజార్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

మరి ఇన్ని అవాంతరాల మధ్య ఈ సినిమా విడుదల అవుతుందా లేదా చూడాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు