'ఫేస్‌బుక్' జాదూ గాళ్లూ..జర జాగ్రత్త!!

ఇప్పుడున్న తరంలో ఫేస్‌బుక్ అంటే తెలియని అమాయకులు ఉన్నారంటే నమ్మలేము కదా.నిజమే ఫేస్‌బుక్ అనేది యువత జీవితంలో ఒక భాగమైపోయింది.

అలాంటి ఫేస్‌బుక్ వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.వివరాల్ళోకి వెళితే.

హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐఎస్ లో చేరేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయిన మొయినుద్దీన్ విషయమే తీసుకోండి.తాను చెప్పిన వివరాలు చూస్తే ప్రతీ పేరెంట్స్ తమ పిల్లలను ఫేస్‌బుక్ విషయంలో కట్టడి చేయాల్సిన పని చాలానే ఉంది.

అమెరికాలో ఇంజినీరింగ్ చదివిన ఈ మొయినుద్దీన్ అక్కడ ఉన్నప్పుడు ఉగ్రవాదంవైపు ఆకర్షితుడయ్యాడట.ఐఎస్ ఐఎస్ పట్ల అట్రాక్ట్ అయిన ఈ మొయినుద్దీన్ దాని తరపున ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం నిర్వహించడాని తెలిపాడు.

Advertisement

అంతేకాకుండా దౌలానా న్యూస్ అనే ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా.ఐఎస్ ఐఎస్ కోసం ప్రచారం చేశాడు మొయినుద్దీన్.

ఆయన ద్వారా చాలామంది ఈ ఉగ్రవాద సంస్థ వైపు ఆకర్షితులయ్యారట.ఈ సంగతి విచారణలో మొయినుద్దీనే చెప్పాడు.

అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ట్యాప్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో నుంచి సమాచారాన్ని వెలికి తీసేందుకు హైదరాబాద్ పోలీసులు ఐటీ నిఫుణుల సాయం తీసుకుంటున్నారు.అతని ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ నెట్ వర్కింగ్ అకౌంట్లు పరిశీలించి, అతనితో టచ్ లో ఉన్నవారినీ విచారిస్తారట.

అందుకే సోషల్ మీడియాలో పరిచయం పెంచుకునేముందు జర జాగ్రత్త సుమా.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు