జుట్టు ఆరోగ్యానికి అండగా బాదం.. ఇలా వాడితే ఊహించని లాభాలు మీ సొంతం!

బాదం గురించి పరిచయాలు అక్కర్లేదు.అద్భుతమైన నట్స్ లో బాదం ఒకటి.

 Best Way To Use Almonds For Healthy And Long Hair , Almonds, Almond Benefits-TeluguStop.com

ఖరీదు ఎక్కువే అయినప్పటికీ.అందుకు తగ్గ పోషకాలు బాదం పప్పులో నిండి ఉంటాయి.

ఆరోగ్యపరంగా బాదంపప్పు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.అయితే జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా.? అవును జుట్టు ఆరోగ్యానికి( Hair health ) బాదం అండగా ఉంటుంది.ఇప్పుడు చెప్పబోయే విధంగా బాదంను వాడితే ఊహించని లాభాలు మీ సొంతం అవుతాయి.

Telugu Almond Benefits, Almonds, Care, Care Tips, Damage, Fall, Oil, Long, Silky

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పది నుంచి ప‌దిహేను బాదం పప్పులు( Almonds) వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె ( Coconut oil )వేసుకోవాలి.అలాగే నాలుగు ఫ్రెష్ మందారం పువ్వులు( Hibiscus flowers ) మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పొడి వేసి చిన్న మంటపై ఉడికించాలి.దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించి ఆపై స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Telugu Almond Benefits, Almonds, Care, Care Tips, Damage, Fall, Oil, Long, Silky

ఇప్పుడు ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా చల్లారిన అనంతరం స్ట్రెనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని.ఒక బాటిల్ లో నింపుకోవాలి.ఈ ఆయిల్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న రెండు గంటల తర్వాత లేదా మరుసటి రోజు షాంపూతో తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే కనుక జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.కురులకు చక్కని పోషణ అందుతుంది.

దీంతో జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది.అలాగే ఈ ఆయిల్ జుట్టును సిల్కీ గా మారుస్తుంది.

డ్రై హెయిర్ సమస్యను( Dry hair problem ) దూరం చేస్తుంది.జుట్టు చిట్లడం, విరగడం వంటివి సైతం తగ్గుముఖం పడతాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube