ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ పిచ్ ను పరిశీలించిన భారత జట్టు కోచ్, కెప్టెన్..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టోర్నీలో భాగంగా నవంబర్ 19వ తేదీ ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.సొంత గడ్డపై జరిగే టోర్నీ టైటిల్ గెలవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది.

 The Coach And Captain Of The Indian Team Inspected The Ahmedabad Pitch Where The-TeluguStop.com

ఈ టోర్నీలో లీగ్ దశ నుండి ఓటమి అనేదే ఎరుగకుండా వరుస విజయాలతో రోహిత్ సేన ఫైనల్ చేరింది.చివరి పోరులో విజేతగా నిలవాలని, అందుకోసం ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు బలాలు, బలహీనతలకు తగ్గట్టు తమ జట్టును సిద్ధం చేసుకునే పనిలో భారత జట్టు నిమగ్నమైంది.ఈ నేపథ్యంలోనే భారత జట్టు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొనడం జరిగింది.

భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్( Rahul Dravid ), బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ లతో పాటు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ), ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ గ్రౌండ్ కు వచ్చారు.బీసీసీఐ క్యూరేటర్లు ఆశిష్ భౌమిక్, తపోష్ ఛటర్జీలలో కలిసి రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ కాసేపు అహ్మదాబాద్ పిచ్ ను పరిశీలించారు.ఈ టోర్నీలో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం లో జరిగిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో అహ్మదాబాద్ లో బ్లాక్ సాయిల్ తో కూడిన పిచ్ ను రూపొందించారు.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కు కూడా ఇదే రకమైన బ్లాక్ సాయిల్ పిచ్ ను రూపొందించనున్నారు.

భారత జట్టు ఫుల్ ఫామ్, దూకుడు చూస్తుంటే కచ్చితంగా ఈ టోర్నీ టైటిల్ భారత్ దే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube