వ‌ర్షాకాలంలో ఈ టీ తాగితే..సీజ‌న‌ల్ వ్యాధులు బహుప‌రార్‌!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం.మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల్సి ఉంటుంది.

ఎందుకంటే.డెంగ్యూ, జ‌లుబు, ఫ్లూ, టైఫాయిడ్, చికెన్ గున్యా, క‌ల‌రా, డ‌యేరియా మొద‌ల‌గు వ్యాధులు ఈ సీజ‌న్‌లోనే అత్య‌ధికంగా ఉంటాయి.ఈ సీజ‌న‌ల్ వ్యాధుల‌కు దూరంగా ఉండాలంటే.

ఖ‌చ్చితంగా రోగ నిరోధ‌క వ్యవ‌స్థ‌ను బ‌ల‌ప‌రుచుకోవాల్సి ఉంటుంది.అయితే అందుకు జీలకర్ర, ధనియాలు మరియు సోంపుతో త‌యారు చేసిన టీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఈ టీని ఎలా త‌యారు చేసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఈ టీ వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా గిన్నె తీసుకుని అందులో ఒకటిన్న‌ర‌ గ్లాస్ వాట‌ర్ పోసి వేడి చేయాలి.

Advertisement

ఇప్పుడు ఇందులో అర స్పూన్ ధ‌నియాలు, అర స్పూన్ జీల‌క‌ర్ర మ‌రియు అర స్పూన్ సోంపు వేసి బాగా మ‌రిగించి.వ‌డ‌బోసుకోవాలి.ఈ టీని డైరెక్ట్‌గానే తీసుకోవ‌చ్చు.

లేదా కొద్దిగా తేనె మిక్స్ చేసుకుని కూడా తాగొచ్చు.

ఈ వ‌ర్షాకాలంలో ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఈ టీని సేవిస్తే. రోగ నిరోధ‌క శ‌క్తి అద్భుతంగా పెరుగుతుంది.దాంతో సీజ‌న‌ల్ వ్యాధులు బ‌హుప‌రార్ అవుతాయి.

అలాగే జీలకర్ర, ధనియాలు మరియు సోంపుతో త‌యారు చేసిన ఈ టీ తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

అంతేకాదు, రెగ్యుల‌ర్‌గా ఈ టీని తీసుకుంటే ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ ఈ టీ ఉప‌యోగ‌ప‌డుతుంది.ఇక ఈ టీని ఉద‌యాన్నే తాగితే.

Advertisement

శరీరంలోని టాక్సిన్స్ అన్నీ తొల‌గిపోతాయి.కాలేయం శుభ్ర ప‌డుతుంది.

అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు.

తాజా వార్తలు