జామ ఆకులతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా!

పెరట్లోనే ఉంటుంది కాబట్టి జామ చులకన.జామపండ్లనే సరిగా పట్టించుకోనప్పుడు జామ ఆకులని ఏం పట్టించుకుంటారులేండి.

కాని పట్టించుకోవాలి.జామ ఆకులలో ఎన్ని అద్భుతాలు దాగున్నాయో తెలిస్తే మీరు తప్పకుండా పట్టించుకుంటారు.

* జామ ఆకులని నీళ్ళలో మరిగించి రోజూ తాగటం అలవాటు చేసుకుంటే బ్యాడ్ కొలెస్టిరాల్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.అలాగే డయాబెటిస్ కి చెక్ పెట్టవచ్చు.

* లివర్ పనిచేసే తీరుని మెరుగుపరుస్తాయి జామ ఆకులు.జామాకు - నీరు .ఈ మిశ్రమాన్ని లివర్ టానిక్ అని కూడా అంటారు.* కొన్నిసార్లు బయటి తిండి తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చు.

Advertisement

అలాగే వాంతులు రావొచ్చు.అలాంటప్పుడు జామ ఆకులు పనిచేస్తాయి.

* జీర్ణక్రియ మెరుగుపడటానికి జామపండ్లే కాదు, జామ ఆకులు కూడా సహాయం చేస్తాయి.ఇందులో ఉండే ఎంజీమ్స్ మన కడుపుకి మంచి నేస్తాలు.

* డెంగ్యూతో బాధపడేవారికి జామ ఆకులు నీటిలో మరిగించి తాగిస్తే ఫలితం ఉంటుంది.జామ ఆకులు రక్తంలో ప్లేట్లేట్స్ సంఖ్య పెంచుతాయి.

* జామాకులు తరుచుగా తినటం వలన వీర్య ఉత్పత్తి కూడా మెరుగుపడుతుందని కొన్ని పరిశోధనలు చెప్పాయి.* గాయాలపై జామ ఆకులు పిండి ఆ పసరుని రాయడం వలన ఉపశమనం పొందవచ్చు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
మొబైల్ ఫోన్ రాత్రి పక్కన పెట్టుకొని నిద్రపోతే ప్రమాదమా.. ముఖ్యంగా పురుషులకు..

ఎందుకంటే ఇందులో యాంటి బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి.* చర్మం యొక్క అందానికి కూడా జామ ఆకులు పనిచేస్తాయి.

Advertisement

ఇవి మొటిమలు, మొటిమల వచ్చిన మచ్చలపై ప్రభావం చూపగలవు.అలాగే దురద లాంటి సమస్యని తగ్గిస్తాయి.

తాజా వార్తలు