ఈ 8 ఆహారాలు డైట్ లో ఉంటే మీ లంగ్స్ ఆరోగ్యానికి ఢోకా ఉండదు!

లంగ్స్.మనల్ని సజీవంగా ఉంచడానికి ఇవి ముఖ్య పాత్రను పోషిస్తాయి.

పొరపాటున లంగ్స్ ఆరోగ్యం పాడైందంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తదితర సమస్యలు తలెత్తుతుంటాయి.

పైగా ఇటీవల రోజుల్లో చాలా మంది లంగ్ క్యాన్సర్ కు గురవుతున్నారు.వీటన్నిటికి దూరంగా ఉండాలి అంటే మీ లంగ్స్ ను మీరు హెల్తీ గా ఉంచుకోవాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే 8 ఆహారాలు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.ఈ 8 ఆహారాలు డైట్ లో ఉంటే మీ లంగ్స్ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆహారాలు ఏంటో ఓ చూపు చూసేయండి.

దానిమ్మ( Pomegranate ).లంగ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో ఒకటి.దానిమ్మ‌ రుచిగా ఉండడమే కాదు ఎన్నో విలువైన పోషకాలను కలిగి ఉంటుంది.

రోజు ఒక్క దానిమ్మ పండును తీసుకుంటే లంగ్స్ ఆరోగ్యంగా మారతాయి.క్యాప్సికమ్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి రక్షణగా ఉంటుంది.

వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు క్యాప్సికమ్( Capsicum ) ను తీసుకుంటే లంగ్స్ ఇన్ఫెక్షన్, క్యాన్సర్ తదితర సమస్యలు వచ్చే రిస్క్ తగ్గుతుంది.లంగ్స్ ను శుభ్రంగా ఆరోగ్యంగా మార్చడానికి క్యారెట్ కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

రోజుకు ఒక క్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే మీ లంగ్స్ హెల్తీ గా ఉంటాయి.

Advertisement

ఊపిరితిత్తుల వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి పసుపు చాలా ఎఫెక్టివ్‌ గా పని చేస్తుంది.అందుకే నిత్యం ఏదో ఒక రూపంలో పసుపు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.లంగ్ డిసీజెస్‌ కు దూరంగా ఉండాలి అనుకునేవారు అల్లాన్ని డైట్ లో చేర్చుకోండి.

అల్లంలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఊపిరితిత్తులకు రక్షణ కవచంగా మారతాయి.లంగ్స్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో గుమ్మడి మరియు గుమ్మడి గింజలు( Pumpkin Seeds ) కూడా ఉన్నాయి.

వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే వివిధ రకాల లంగ్స్ సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

బాదం, వాల్ నట్స్, పిస్తా, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, పుచ్చ గింజలు, చియా విత్తనాలు ఇలా నట్స్ అండ్ సీడ్స్ ను డైట్ లో చేసుకోవాలి.ఇవి లంగ్స్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.ఇక ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో ఆరెంజ్ కూడా ఒకటి.

రెగ్యులర్ గా ఆరెంజ్ ను తీసుకుంటే లంగ్స్ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు.ఈ ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడంతో పాటు ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లను మానుకోవాలి.

వాటర్ ఎక్కువగా సేవించాలి.

తాజా వార్తలు