పొరపాటున కూరలో ఉప్పు,కారం ఎక్కువైందా...ఇలా చేస్తే ఉప్పు,కారం తగ్గి వంట రుచి పెరుగుతుంది   Best Dates To Marry Using Zodiac Signs     2018-01-23   23:15:46  IST  Raghu V

ఒక వ్యక్తి పుట్టిన తేది,సమయాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క నక్షత్రం,రాశి చెప్పుతారు. ఆ రాశి బట్టి వారి జీవితం ఎలా ఉంటుంది….అదృష్టం ఎప్పుడు వస్తుంది….వివాహం ఎప్పుడు అవుతుంది. ఇలాంటి విషయాలను రాశిని బట్టి చెప్పుతూ ఉంటారు. అయితే 2018 వ సంవత్సరంలో ఏ రాశి వారు ఏ నెలలో ఏ రోజు పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందో తెలుసుకుందాం.

1. మేష రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ నెలలో అయినా 27వ తేదీన వివాహం చేసుకుంటే మంచిది. ఈ తారీఖున వివాహం చేసుకుంటే వీరి వైవాహిక జీవితం హ్యాపీగా ఉండి కాపురంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వీరికి అదృష్టం కూడా కలిసివస్తుంది.

2. వృషభ రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ నెలలో అయినా 7వ తేదీన వివాహం చేసే మంచి జరుగుతుంది. ఈ తారీఖున వివాహం చేసుకుంటే వారి కాపురంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారు.

3. మిథున రాశి
ఈ సంవత్సరంలో ఈ రాశి వారు ఏ నెలలో అయినా 9వ తేదీన వివాహం చేసుకుంటే మంచిది. ఈ తారీఖున వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని విషయాల్లోను విజయం సాధిస్తారు.

4. కర్కాటక రాశి
ఈ రాశి వారు ఏ నెలలో అయినా 15వ తేదీన పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా హ్యాపీగా ఉంటారు.

5. సింహ రాశి
వీరు ఏ నెలలో అయినా 3వ తేదీన పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల బంధం బాగా బలంగా ఉండటమే కాకుండా ఇద్దరూ కలివిడిగా ఉంటారు.

6. కన్యారాశి
ఈ రాశి వారు ఏ నెలలో అయినా 11వ తేదీన పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది. వివాహ జీవితాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తూ ప్రేమగా ఉంటారు. వీరి మధ్య ఎలాంటి వివాదాలు రావు.

7. తుల రాశి
ఈ రాశి వారు ఏ నెలలో అయినా 2వ తేదీన పెళ్లి చేసుకుంటే వారి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తలు ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా కాపురం చేస్తారు.

8. వృశ్చిక రాశి
వీరు ఏ నెలలో అయినా 18వ తేదీన పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఎలాంటి కలహాలు,సమస్యలు లేకుండా కాపురం చేస్తారు.

9. ధనుస్సు రాశి
వీరు ఏ నెలలో అయినా 21వ తేదీన పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు లేకుండా వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

10. మకర రాశి
వీరు ఏ నెలలో అయినా 30వ తేదీన పెళ్లి చేసుకుంటే జీవితాంతం వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు,ఇబ్బందులు లేకుండా హాయిగా కాపురం చేస్తారు.

11. కుంభ రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ నెలలో అయినా 14వ తేదీన వివాహం చేసుకుంటే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది.అలాగే వారి మధ్య బంధం కూడా బలపడుతుంది.

12. మీనం
ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ నెలలో అయినా 20వ తేదీన పెళ్లి చేసుకుంటే మంచి జరగటమే కాకుండా భార్యాభర్తలు మధ్య అన్యోన్యత బాగుటుంది. ఎటువంటి కలహాలు లేకుండా కాపురం చేస్తారు.