కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ అగ్ర రాజ్యాలను కూడా దడదడలాడిస్తుంది.
ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ అత్యంత దారుణంగా వేగంగా వ్యాపిస్తుంది.ఈ నేపథ్యంలోనే ఇటీవలే పెళ్లి అయ్యి విదేశాలలో హనీమూన్ వెళ్లిన దంపతులకు కరోనా వైరస్ సోకింది.
బెంగళూరు నగరంలోని గూగుల్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందని నిన్న తేలింది.దీంతో ఆ ఉద్యోగికి సమీపంలోని ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు.
అయితే కరోనా వైరస్ సోకిన గూగుల్ ఉద్యోగి దంపతులు హనీమూన్ కోసం ఇటీవల విదేశాలలో పర్యటించి వచ్చారని ఆగ్రా వైద్యాధికారుల పరిశీలనలో తెలిసింది.దీంతో ఆ ఉద్యోగి భార్యకు కూడా కరోనా వైరస్ టెస్టులు చెయ్యాలి అంటే కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.
దీంతో అక్కడ కలెక్టర్, పోలీసులు రంగంలోకి దిగి టెస్ట్ చేపించగా భార్యకు కూడా కరోనా వైరస్ సోకింది అని తేలింది.దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యి భార్య కుటుంబసభ్యులు 9 మందిని కూడా ఆగ్రాలోని ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు.
Corrections : 3/16/2020
ఈ పోస్ట్ ముందు వర్షన్ లో భార్య పరారు అన్ని తప్పుడు గా పబ్లిష్ చేసాం.పోస్ట్ చేసినందుకు మన్నించగలరు.
కరోనా వైరస్ వచ్చిన టెక్కీ భార్య పారిపోయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని కర్నాటక ప్రభుత్వం వివరణ ఇచ్చంది.పూర్తి వివరాల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి చూడండి.