కరోనా ఎఫెక్ట్.. తెలంగాణాలో థియేటర్స్ బంద్!

కరోనా వైరస్.దీని ఎఫెక్ట్ దేశంపై ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Coronavirus Effect Telangana Cinema Theaters Bundh For Few Days-TeluguStop.com

ఇప్పటికే ఎన్నో ఇండస్ట్రీలు నష్టాల భారిన పడ్డాయి.ఇంకా ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ తెలుగు సినిమాలపై కూడా భారీగా పడింది.

ఇప్పటికే ఈ కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటుంది.

ఇంకా కరోనా ప్రభావం ఉంటుంది అని తెలిసిన ఏరియాల్లో స్కూళ్లు, కాలేజీలు షాపింగ్ మాల్స్, పబ్‌లు అన్ని కూడా ఒక నెల రోజులు పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణాలో కొద్దికాలం పాటు థియేటర్లను కూడా బంద్ చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది.

అయితే ఈరోజు ఉదయం తెలంగాణ ఫిల్మ్ చాంబర్‌ సభ్యులు భేటీ అయ్యారు.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, థియేటర్ యజమానులు అందరూ కలిసి సంయుక్తంగా కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.ఏప్రిల్ 1వ తేదీ లేదా కనీసం ఉగాది వరకు అయిన థియేటర్లను మూసివెయ్యాలని నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube