ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో స‌గ్గుబియ్యం తింటే ఏం అవుతుందో తెలుసా?

ప్ర‌తి మ‌హిళ జీవితంలోనూ ప్రెగ్నెన్సీ స‌మ‌యం అనేది ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది.ఆ స‌మ‌యంలో ఎన్నో మ‌ధుర‌మైన అనుభూతులు, మ‌రెన్నో అనుభ‌వాల‌ను పొందుతుంటారు.

అలాగే క‌డుపులోని శిశువు ఆరోగ్యంగా ఎదిగేందుకు బోలెడ‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.డైట్‌లో పోష‌కాహారం ఉండేలా చూసుకుంటారు.

అయితే గ‌ర్భిణీ స్త్రీలు తెలిసో, తెలియ‌కో కొన్ని కొన్ని ఆహారాల‌ను ప‌క్క‌న పెట్టేస్తుంటారు.అటు వంటి వాటిల్లో సగ్గుబియ్యం కూడా ఒక‌టి.

చాలా మంది స్త్రీలు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో స‌గ్గు బియ్యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోరు.అస‌లు తినేందుకే ఇష్ట ప‌డ‌రు.

Advertisement

కానీ, స‌గ్గు బియ్యం గ‌ర్భిణీ స్త్రీల‌కు ఎంతో మేలు చేస్తాయి.స‌గ్గు బియ్యంలో ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, ఫాస్ప‌ర‌స్‌, కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్ ఇలా చాలా పోష‌కాలే నిండి ఉంటాయి.అందుకే స‌గ్గు బియ్యం హెల్త్‌కి ఎన్నెన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

ముఖ్యంగా మ‌హిళ‌లు ప్రెగ్నెన్సీ టైమ్‌లో స‌గ్గు బియ్యాన్ని త‌ర‌చూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఫోలిక్‌ యాసిడ్ పుష్క‌లంగా అందుతుంది.దాంతో క‌డుపులోని బిడ్డ ఎదుగుద‌ల అద్భుతంగా ఉంటుంది.

శిశువు అవలక్షణాలతో పుట్టే ప్రమాదం తగ్గు ముఖం ప‌డుతుంది.మ‌రియు పుట్టబోయే బిడ్డ‌లో ర‌క్త హీన‌త స‌మ‌స్య ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

అలాగే స‌గ్గు బియ్యం తీసుకుంటే గ‌ర్భిణీలకు అవ‌స‌ర‌మ‌య్యే అతి ముఖ్య‌మైన పోష‌కాలు ఐర‌న్‌, విట‌మిన్ బి కూడా ల‌భిస్తాయి.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

అంతేకాదు, స‌గ్గు బియ్యాన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే.ప్రసవ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులూ తగ్గుతాయి.ఇక గ‌ర్భిణీల‌కే కాదు.

Advertisement

ఎవ్వ‌రికైనా స‌గ్గు బియ్యం మంచే చేస్తాయి.ముఖ్యంగా మ‌ధుమేహాన్ని అదుపు చేయ‌డంలోనూ, జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంలోనూ మ‌రియు ఎముక‌ల‌ను దృఢంగా మార్చ‌డంలోనూ స‌గ్గు బియ్యం సూప‌ర్‌గా హెల్ప్ చేస్తాయి.

కాబ‌ట్టి, గ‌ర్భిణీలే కాకుండా అంద‌రూ స‌గ్గు బియ్యాన్ని తీసుకోవ‌చ్చు.

తాజా వార్తలు