చాలా మంది రోజులో ఎప్పుడు పడితే అప్పుడు ముఖం కడుగుతూ ఉంటారు.అయితే ముఖం కడగటానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి.
ఎలా పడితే అలా ముఖాన్ని కడిగితే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ముఖం కడగటానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి.
అంతేకాని బాగా వేడి,బాగా చల్లని నీటిని ఉపయోగించకూడదు.
స్క్రబ్ తో ముఖం శుభ్రం చేసాక ఫెస్ వాష్ ని ఉపయోగించకూడదు.
ఎందుకంటే చర్మ రంద్రాల్లోకి ఘాటైన రసాయనాలు వెళ్లే ప్రమాదం ఉంది.
స్క్రబ్ ఉపయోగించిన తర్వాత ఐస్ తో మసాజ్ చేసుకోవాలి.
మేకప్ వేసుకొనే అలవాటు ఉన్నవారు….మేకప్ తొలగించిన తర్వాత మాత్రమే ముఖాన్ని కడగాలి.
ఈ విధంగా చేయకపోతే రాష్ వచ్చే అవకాశం ఉంది.
ముఖం కడగటానికి ముందు చేతులకు మురికి లేకుండా ఉండేలా చూసుకోవాలి.
చేతులకు ఏమైనా బ్యాక్టీరియా ఉంటే యుక్నే వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అందువల్ల చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతే ముఖాన్ని కడగాలి.
ముఖం కడిగిన ప్రతి సారి చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి.