చ‌లికాలంలో డార్క్ చాక్లెట్స్‌ తింటే ఏం అవుతుందో తెలుసా?

చ‌లి కాలం రానే వ‌చ్చింది.ఈ సీజ‌న్‌లో చ‌లితో పాటు ఎన్నో జ‌బ్బులు కూడా వెంటాడుతుంటాయి.

అందుకే మిగిలిన సీజ‌న్స్‌తో పోలిస్తే.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఇక ఆరోగ్యంగా ఉండాలంటే.పోష‌కాహారం ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

ఇదిలా ఉంటే, ఈ వింట‌ర్ సీజ‌న్‌లో చాలా మంది డార్క్ చాక్లెట్స్ తినేందుకు బ‌య‌‌ప‌డుతుంటారు.‌చిన్న పిల‌ల్ని కూడా తిన‌నివ్వ‌రు.

Advertisement

జ‌లుబు చేస్తుందేమో అన్న భ‌య‌మే అందుకు కార‌ణం.అయితే వాస్త‌వానికి ఈ వింట‌ర్ సీజ‌న్‌లో డార్క్ చాక్లెట్స్ తింటే ఎంతో మంచిది.

డార్క్ కోకో పౌడర్‌లో అధిక శాతంలో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి.అందువ‌ల్ల, డార్క్ కోకో పౌడర్‌తో త‌యారుచేసిన డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల.

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.ఫ‌లితంగా అనేక ర‌కాల వైర‌స్‌లు, జ‌బ్బుల నుండి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

అలాగే డార్క్ చాక్లెట్స్‌ను రెగ్యుల‌ర్‌గా త‌గిన మోతాదులో తీసుకుంటే బాడీ టెంపరేచర్ ను పెంచి.వింట‌ర్ సీజ‌న్‌లో చ‌లిని త‌ట్టుకునే శ‌క్తిని అందిస్తుంది.ఇక ఈ చ‌లి కాలంలో ప్ర‌తి ఒక్క‌రి చ‌ర్మం పొడి బారిపోతుంటుంది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

మ‌రియు ముడ‌త‌ల స‌మస్య‌ను కూడా ఎదుర్కొంటారు.అయితే డార్క్ చాక్లెట్స్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే విట‌మిన్స్‌ మ‌రియు మిన‌ర‌ల్స్‌.

Advertisement

వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ముడ‌త‌ల‌ను త‌గ్గించ‌డంతో పాటు చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మారుస్తుంది.అదేవిధంగా.

డార్క్ చాక్లెట్స్‌ను ప్ర‌తి రోజు మోతాదు మించ కుండా తీసుకుంటే.ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌, డిప్రెషన్ వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి మెద‌డు ప‌ని తీరును మెరుగుప‌రుస్తుంది.

అలాగే ర‌క్త పోటును అదుపులో ఉంచ‌డంలోనూ, శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా చేయ‌డంలోనూ డార్క్ చాక్లెట్స్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి, వింట‌ర్ సీజ‌న్ అనే కాదు.

ఏ సీజ‌న్‌లో అయినా డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి మంచివే.కానీ, అతిగా మాత్రం తీసుకోరాదు.

తాజా వార్తలు