త‌మ‌ల‌పాకును ఇలా తీసుకుంటే..వ‌ర్షాకాలంలో వేధించే ఆ స‌మ‌స్య‌లు ప‌రార్‌!

వ‌ర్షాకాలం రానే వ‌చ్చింది.

ఈ సీజ‌న్‌లో అనేక అంటు వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు, విష జ్వ‌రాల‌తో పాటు జలుబు, ముక్కుదిబ్బ‌డ‌, ద‌గ్గు, గొంతులో గ‌ర‌గ‌ర‌, శ్వాస స‌రిగ్గా ఆడకపోవడం, ముక్కు నుంచి నీరు కార‌డం, గొంతులో క‌ఫం పేరుకోవ‌డం ఇలా ఎన్నో స‌మ‌స్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

దాంతో వీటిని త‌గ్గించుకునేందుకు ర‌క‌ర‌కాల మందులు వాడుతూ ఉంటారు.అయితే న్యాచుర‌ల్‌గా కూడా వ‌ర్షాకాలంలో వేధించే ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

అందుకు త‌మ‌ల‌పాకు అద్భుతంగా స‌హాయ‌ ప‌డుతుంది.మ‌రి త‌మ‌ల‌పాకును ఎలా యూజ్ చేయాలో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసు కుందాం.

లేత‌గా, ఫ్రెష్‌గా ఉన్న ప‌ది త‌మ‌ల‌పాకుల‌ను తీసుకుని మెత్త‌గా నూరి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఈ త‌మ‌ల‌పాకుల ర‌సంలో తేనె, నిమ్మరసం క‌లిపి ఉద‌యాన్నే తీసుకోవాలి.

Advertisement

ఇలా ప్ర‌తి రోజు చేస్తే జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.మ‌రియు శ్వాస కూడా బాగా అందుతుంది.

అలాగే ఒక లేత త‌మ‌ల‌పాకును తీసుకుని అందులో రెండు మిరియాలు పెట్టి బాగా న‌మిలి మింగేయాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే గొంతులో క‌ఫం త‌గ్గుతుంది.దాంతో ద‌గ్గు, గొంతులో గ‌ర గ‌ర స‌మ‌స్యలు ప‌రార్ అవుతాయి.

ప్రెష్‌గా ఉన్న రెండు త‌మ‌ల‌పాకుల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఈ ర‌సాన్ని గోరు వెచ్చ‌ని పాల‌లో క‌లిపి తీసుకోవాలి.ఇలా చేస్తే రోగ నిరోధక శక్తి పెంచుతుంది.

దాంతో వైర‌స్‌లు, విష జ్వ‌రాలు, ఇన్ఫెక్ష‌న్లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.తమలపాకును వెచ్చగా చేసి ఛాతీపై ఉంచు కోవాలి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

ఇలా చేస్తే శ్వాస సంబంధ ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.వ‌ర్షా కాలంలో ఎక్కువ‌గా ఉండే ఆస్త‌మా ల‌క్ష‌ణాలు కూడా దూరం అవుతాయి.

Advertisement

తాజా వార్తలు