Bellamkonda srinivas : పవన్ డైరెక్టర్ తో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ.. ఫోటోస్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ( Bellamkonda srinivas )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బెల్లంకొండ శ్రీనివాస్ వేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా అల్లుడు శీను.

ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.హీరోగా నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

ఇంకా తెలుగులో అల్లుడు శీను, జయ జానకి నాయక, స్పీడున్నోడు లాంటి సినిమాలలో నటించి మెప్పించాడు.ఇది ఇలా ఉంటే ఇటీవలే చత్రపతి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి( Chatrapathi ) సినిమాను హిందీలో రీమేక్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్.కానీ ఊహించనీ విధంగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.దీంతో మళ్లీ టాలీవుడ్ బాట పట్టాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్.

Advertisement

ఇకపోతే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఒక కొత్త సినిమాను ప్రారంభించాడు.సాగర్ కే చంద్ర( Saagar K Chandra ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా తర్వాత రెండో సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ తో తీయబోతున్నాడు సాగర్ కే చంద్ర.బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించనున్న ఈ సినిమా తాజాగా గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

అంతేకాదు ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్లు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, పరశురాం అతిథులుగా హాజరయ్యారు.ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ మేరకు ముహూర్తం షాట్‌కు హరీష్ శంకర్ క్లాప్ కొట్టడం విశేషం.

ఇక బెల్లంకొండ హీరోగా నటిస్తున్న చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు.ఈ ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్‌లోనే పూజా కార్యక్రమాలు నిర్వహించారు.BS10 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ సెకండ్ వీక్ నుంచి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తారేమో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు