ఓరి మీ దుంపల్‌ తెగ.. బీర్ యోగా అట.. ఎలా చేస్తున్నారో చూడండి!

భారతదేశంలో ఆవిర్భవించిన యోగా శరీరం, మనస్సు ఆత్మను కలిపే ఆధ్యాత్మిక సాధనగా నిలుస్తోంది.శారీరక, మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడంలో, సెల్ఫ్-అవేర్నెస్( Self-awareness ) పెంపొందించడంలో పర్సనల్ గ్రోత్‌కి తోడ్పడడంలో యోగాకి మించిన సాధన మరొకటి లేదు.

 Beer Yoga  See How They Are Doing, Denmark, Beer Yoga, Viral Video, Beer Cans, R-TeluguStop.com

ఇలాంటి ఆధ్యాత్మిక సాధనను తమకు నచ్చినట్లు మార్చేసి చివాట్లు తింటున్నారు డెన్మార్క్( Denmark ) ప్రజలు.వీరు బీర్ యోగా అంటూ దిక్కుమాలిన ట్రెండ్ క్రియేట్ చేసి భారతీయులకు ఆగ్రహం తెప్పిస్తున్నారు.

తాము చేస్తున్న బీరు( beer ) యోగాకు సంబంధించిన వీడియోను వారు ఇటీవల ఇంటర్నెట్లో షేర్ కూడా చేశారు.దీన్ని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.

వైరల్ వీడియోలో 100 మంది దాకా ప్రజలు బీరు బాటిల్స్ పట్టుకుని యోగా చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.అలానే యోగా టీచర్లు పార్టిసిపెంట్లను బీరు ఆనందించమని ప్రోత్సహించడం కనిపించింది.బ్యాలెన్స్, రిలాక్సేషన్‌తో సహాయం చేయడానికి బీర్ క్యాన్‌లను ఉపయోగిస్తున్నామని వీరు చెబుతున్నారు.ఈ వింత యోగా ఒక్కో సెషన్‌కు సుమారు 100 మంది హాజరవుతారు.ఈ ఈవెంట్ నాలుగు సంవత్సరాలుగా జరుగుతోంది.కొంతమందికి ఇది వినోదభరితంగా అనిపించినప్పటికీ, యోగా భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగంగా పరిగణించడం జరుగుతోంది.

దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని, ఆల్కహాల్ తాగుతూ దీన్ని చేయడం చాలా బాధాకరమని కొందరుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.బీర్ యోగా ( Beer yoga )అగౌరవంగా ఉందని, సంప్రదాయ యోగాలోని సారాంశాన్ని పలుచన చేసిందని వారు అభిప్రాయపడుతున్నారు.బీర్ యోగా జర్మనీలో ఉద్భవించింది.ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలలో పాపులర్ అయ్యింది.కాగా బీర్ యోగా వంటి ట్రెండ్స్ భారతీయ యోగా సాంప్రదాయిక సూత్రాలు, సాంస్కృతిక ప్రాముఖ్యతను దెబ్బతీస్తాయని ఇండియన్స్ పెదవి విరుస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube