గంధం పొడిలో ఇవి క‌లిపి రాస్తే.. అంద‌మైన చ‌ర్మం మీ సొంతం!

గంధం పొడి.దీనినే చంద‌నం పొడి అని కూడా పిలుస్తుంటారు.

అద్భుత‌మైన సువాస‌న క‌లిగి ఉండే గంధం పొడి.

చ‌ర్మ సౌంద‌ర్యం పెంచ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

మొటిమ‌ల‌ను పోగొట్ట‌డంతో, చ‌ర్మ ఛాయ‌ను పెంచ‌డంలో, న‌ల్ల మ‌చ్చ‌ల‌ను త‌గ్గించ‌డంలో, మృదువైన చ‌ర్మాన్ని అందించ‌డంలో గంధం పొడి ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.అయితే చ‌ర్మానికి గంధం పొడి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో కొద్దిగా గంధం పొడి, ప‌సుపు మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నిటీతో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారినికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు క్ర‌మంగా పోయి.

చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.రెండొవ‌ది ఒక బౌల్ తీసుకుని.

అందులో ఒక ఒక‌ టీ స్పూన్ గంధం పొడి మ‌రియు ఒక టీ స్పూన్ పాలు వేసి బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

అర‌గంట పాటు అలా వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని, మెడ‌ను శుభ్రం చేసుకోవాలి.

Advertisement

ఇలా వారినికి నాలుగు సార్లు చేస్తు ఉంటే.ముడ‌త‌లు పోయి ముఖం మృదువుగా, అందంగా మారుతుంది.

మూడొవ‌ది ఒక బౌల్ తీసుకుని.అందులో ఒక ఒక‌ టీ స్పూన్ గంధం పొడి, అర టీ స్పూన్ నిమ్మ‌ర‌సం, అర టీ స్పూన్ రోజ్ వాట‌ర్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.రెండు, మూడు నిమిషాల పాటు మ‌సాజ్ చేయాలి.

ఓ పావు గంట వ‌దిలేసిన అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో వాష్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం ఛాయ పెరుగుతుంది.

మ‌రియు ముఖం ప్ర‌కాశవంతంగా త‌యార‌వుతుంది.

తాజా వార్తలు