మొటిమ‌ల్లేని మెరిసే చ‌ర్మానికి క్యాబేజీ.. ఎలా వాడాలంటే?

ఆకుకూర‌ల్లో ఒక‌టైన క్యాబేజీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

క్యాబేజీలో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, ఫైబ‌ర్‌, ఐరన్, పొటాషియం వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయి.

కేల‌రీలు మాత్రం త‌క్కువ‌గా ఉంటాయి.అందుకే క్యాబేజీ అత్య‌ధికంగా వాడుతుంటారు.

ఇక క్యాబేజీ తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు, ప్రాణాంక‌మైన క్యాన్స‌ర్, అల్జీమ‌ర్స్‌, మ‌ల‌బ‌ద్ధ‌కం, వైర‌ల్ ఫీవ‌ర్స్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.ఇక సౌంద‌ర్య ప‌రంగా కూడా క్యాబేజీ అనేక విధాలుగా ఉప‌యోగ‌పుడుతుంది.

ముఖ్యంగా మొటిమ‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను, ముడ‌త‌ల‌ను తొలిగించ‌డంతో.చర్మాన్ని య‌వ్వ‌నంగా మెరిసేలా చేయ‌డంలో క్యాబేజీ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

మ‌రి ఇంత‌కీ క్యాబేజీని ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు క్యాబేజీ ఆకుల‌ను తీసుకుని.

మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో కొద్దిగా బియ్యం పిండి మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు దూరం అవుతాయి.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

అలాగే మూడు లేదా నాలుగు క్యాబేజీ ఆకుల‌ను పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సంలో కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి.ముఖానికి, మెడ‌కు ప‌ట్టించాలి.

Advertisement

ఇర‌వై నిమిషాల త‌ర్వాత ముఖాన్ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముడ‌త‌లు పోయి.

ముఖం య‌వ్వ‌నంగా మ‌రియు కాంతివంతంగా మారుతుంది.ఇక క్యాబేజీ ఆకుల నుంచి ర‌సం తీసుకుని.

అందులో కొద్దిగా శెన‌గ‌పిండి మ‌రియు రోజ్ వాట‌ర్ వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లే చేసి.

అర‌గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.

ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.మృత‌క‌ణాలు, మురికి పోయి.

ముఖం అందం మెరుస్తుంది.

తాజా వార్తలు