బీస్ట్ ట్రైలర్.. KGF కి తగ్గ సినిమానే..!

దళపతి విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా బీస్ట్.

సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది.

అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే సెన్సేషనల్ హిట్ కాగా లేటెస్ట్ గా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.సినిమా తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఏప్రిల్ 13న రిలీజ్ అవుతున్న బీస్ట్ సినిమా కె.జి.ఎఫ్ చాప్టర్ 2కి పోటీగా రిలీజ్ అవుతుంది.కె.జి.ఎఫ్ మొదటి పార్ట్ ఎన్నో సంచలనాలు సృష్టించగా ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నారు.కె.జి.ఎఫ్ ని ఢీ కొట్టే సినిమా అంటే ఆ రేంజ్ కి తగినట్టుగా ఉండాల్సిందే.అయితే బీస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం కె.

జి.ఎఫ్ 2కి బీస్ట్ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తుంది.విజయ్ బీస్ట్, యశ్ కె.జి.ఎఫ్ 2 ఇద్దరు చేసే బాక్సాఫీస్ ఫైట్ లో తప్పకుండా రెండు సినిమాలు భారీ అంచనాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.రెండు సినిమాల ట్రైలర్స్ అయితే భారీగా ఉండగా మరి సినిమాలు అదే స్థాయిలో ఉంటాయా లేదా అన్నది చూడాలి.

Advertisement
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

తాజా వార్తలు