జాగ్రత్త సుమా.. ఈ వాట్సాప్‌ లింక్స్ ఓపెన్ చేశారంటే ఇక అంతే..!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తూ కొందరు సైబర్ కేటుగాళ్లు అనేక మార్గాలలో ప్రయత్నాలు చేస్తూ డబ్బులను కాజేస్తున్నరు.

ఈ రోజుల్లో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్‌ వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.

దీనినే ఆసరాగా చేసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో వైరస్ ను వ్యాప్తి  చేయడం కొరకు అనేక మార్గాలలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.సాధారణంగా వాట్సాప్‌ గ్రీన్ కలర్ లోనే ఉంటుంది.

కానీ, వాట్సాప్‌ కొత్త రంగులో వస్తుందని కొన్ని ఫేక్  లింకులు వాట్సప్ గ్రూపులలో, పర్సనల్ మెసేజ్ ల రూపంలో అందరికీ పంపుతున్నారు సైబర్ కేటుగాళ్లు.వాస్తవానికి ఆ లింక్స్  వైరస్ లింక్స్ ఎప్పటికీ కూడా వాట్సాప్‌ కలర్ మారదు.

ఈ  విషయం తెలియని చాలా మంది ఆ లింక్స్ ను ఓపెన్ చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు పింక్ వాట్సాప్‌ అంటూ వైరల్ అవుతున్న లింక్, వైరస్ లింక్ పట్ల  వాట్సాప్ యూజర్స్ ‌జాగ్రత్తగా వహించాలని టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు.

Advertisement

కొందరు కేటుగాళ్లు ఈ లింక్ ని క్లిక్ చేస్తే వాట్సాప్ లో సరికొత్త ఫీచర్లతో మీకు అందుబాటులోకి తీసుకు వస్తాయని తెలుపుతున్నారు.ఇది నిజమే అనుకొని లింక్ ఓపెన్ చేస్తే సరి వైరస్ మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది.ఏ వాట్సాప్ గ్రూపు లో నైనా,  ఫ్రెండ్స్ పంపిన కూడా ఎట్టిపరిస్థితిలో ఆ ఫేక్ లింక్ ను ఓపెన్ చేయవద్దు.

ఎటువంటి వాట్సాప్ అప్డేట్ వచ్చిందని తెలియగానే నేరుగా వాట్సాప్ ప్లే స్టోర్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొని వస్తుందని టెక్ దిగ్గజాలు తెలియజేస్తున్నారు.ఒక వేళ  ఇప్పటికే ఆ ఫేక్ లింక్ ను ఎవరైనా  ఓపెన్ చేసి ఉంటె వెంటనే మీ ఫోన్ ను రీసెట్ చేసుకోవడం చాలా మంచిది లేదా మీ మెయిల్ ఐడి , బ్యాంకు ఖాతాలు, మార్చుకుంటే మంచిదని టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు