టెలిగ్రామ్ లో ఇలాంటి మెసేజ్ లతో జాగ్రత్త.. రూ.25 లక్షలు స్వాహా..!

ప్రస్తుతం భారతదేశంలో ఆన్లైన్ స్కామ్స్ ( Online scams )విపరీతంగా పెరుగుతున్నాయి.ఇందులో ఉద్యోగాల పేరుతో మోసపోయే అమాయకులే అధికంగా ఉన్నారు.

ఈ కోవలోనే ఓ వ్యక్తి ఏకంగా రూ.25 లక్షలు పోగొట్టుకున్నాడు.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

గురుగ్రామ్( Gurugram ) లోని సెక్టార్ 57 లో నివసిస్తున్న సుబ్రతా గోష్( Subrata Ghosh ) కు టెలిగ్రామ్ లో ఒక జాబ్ ఆఫర్ కనిపించింది.అందులో ఉండే స్కామర్ కు ఫోన్ చేయగా చాలా మంచి జాబ్ ఆఫర్ అని అత్యాశ చూపించాడు.

కేవలం ఇంట్లో ఉంటూ తాను ఫార్వర్డ్ చేసిన లింక్ లకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తే చాలు డబ్బులు సంపాదించవచ్చని బాధితుడికి నమ్మకపు మాటలు చెప్పాడు.అయితే కొన్ని ప్రీపెయిడ్ టాస్కులు ముందు పూర్తి చేయాలని, ఆ టాస్కులు సులభంగానే ఉంటాయని చెప్పాడు.

ఈ టాస్కులను పంపించాలంటే రూ.10,000 పెట్టుబడి పెట్టాలని, ఆ తర్వాత 30 లింకులను రేట్ చేద్దామని తెలిపారు.గోష్, స్కామర్ చెప్పినట్లు డబ్బులు పంపించి అన్ని టాస్కులను పూర్తిచేసి లాభాలను కూడా పొందాడు.

Advertisement

ఇలా బాధితుడి నమ్మకాన్ని స్కామర్ గెలుచుకున్నాడు.సమయం చూసుకొని బాధితుడితో ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చు కదా అని ఆ దశలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించాడు.

అత్యాశకు పోయిన గొష్ భారీగా పెట్టుబడులు పెట్టాడు.తరువాత టాస్కులు కంప్లీట్ చేయకపోతే ఆకౌంటు ఫ్రీజ్ అవుతుందని, ఇంతవరకు సంపాదించిన మొత్తం పొందే అవకాశం ఉండదని బాధితుడిని స్కామర్ భయభ్రాంతులకు గురి చేశాడు.

అయితే అకౌంట్లో ఉండే మొత్తం డబ్బులు విత్ డ్రా చేసుకోవడం కోసం గోష్ ఏకంగా రూ.25,29,176 పెట్టుబడి పెట్టాడు.కానీ గోష్ తన అకౌంట్లోని డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి స్కామర్ అనుమతి ఇవ్వలేదు.పైగా రూ.12 లక్షలు డిపాజిట్ చేయాలని లేకపోతే అకౌంట్ హ్యాక్ అవుతుందని బెదిరించాడు.అయితే బాధితుడు తాను సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కాననే విషయం గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రభాస్, బన్నీ, తారక్ సాధించారు.. చరణ్ గేమ్ ఛేంజర్ తో లెక్కలు తేలుస్తారా?
Advertisement

తాజా వార్తలు