ఎక్కడపడితే అక్కడ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా.. ఇక అంతే సంగతులు!

మనలో అనేకమంది రైల్వే స్టేషన్‌లోనో, బస్టాండు దగ్గరో, విమానాశ్రయాలు, ఆస్పత్రులు, అలాగే షాపింగ్‌ మాల్స్‌ వంటి బహిరంగ ప్రదేశాలలో మొబైళ్లను ఛార్జింగ్‌ పెట్టడం చూస్తూ ఉంటాం.

ఇలా బహిరంగ ప్రదేశాలలో ఛార్జింగ్‌లు పెట్టే క్రమంలో సమస్యల్లో చిక్కుకున్న వారు చాలా మంది ఉన్నారు.

ఇలా ఛార్జింగ్‌ పెట్టి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నవారు వున్నారు.ఇలాంటి కేసులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అయితే రైల్వే స్టేషన్‌లో ఛార్జింగ్ పెట్టే ఛార్జర్‌లో ముందుగానే ఓ చిప్ ఇన్‌స్టాల్ చేసి ఉంటారు సైబర్‌ నేరగాళ్లు.దీంతో ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు అది మొబైల్‌లోని మొత్తం డేటాను సేకరించి అందులోకి పంపిస్తుంది.

ఇలా చేయడాన్ని జ్యూస్ జాకింగ్ అంటారు.ఛార్జింగ్‌ పెట్టగానే మీ బ్యాంకు వివరాలతో పాటు ఇతర వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తాయి.

Advertisement

ఇంకేముందు మీ పని అయిపోయినట్టే.మీ బ్యాంకులో ఉన్న డబ్బంతా క్షణాల్లోనే ఖాళీ అయిపోతుంటుంది.

పెన్‌డ్రైవ్‌లు మొదలైన వాటిలో కనిపించే విధంగా USB పోర్ట్‌లు డేటా బదిలీ కోసం విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.ఒక వినియోగదారు USB పోర్ట్‌కి ఛార్జర్‌ని కనెక్ట్ చేసి, దాన్ని ఆన్ చేసినప్పుడు డేటా బదిలీని సూచించే పాప్‌అప్ వారికి చూపబడుతుంది.

ఇలా రైల్వే స్టేషన్‌లు, ఆస్పత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఛార్జర్‌లలో మీరు ఫోన్‌,ఇతర పరికరాలు ఛార్జింగ్‌ పెట్టగానే మీ వివరాలన్ని హ్యాకర్లకు చేరిపోతాయి.

ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌, రాజస్థాన్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో జరిగాయి.బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇలాగే ఒకామె వ్యక్తిగత వివరాలుతో పాటు మొబైళ్లో ఉన్న ఫోటోలు, వీడియోలు హ్యాకర్లకు చిక్కాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

వాటిలో తన భర్త ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి.దీంతో హ్యాకర్లు ఆమెను బ్లాక్‌ మెయిలింగ్‌ చేసే పనిలో పడ్డారు.తమకు రూ.5 లక్షలు ఇవ్వకపోతే ఫోటోలన్ని ఇంటర్నెట్‌లో పెడతామని హెచ్చరించారు.వెంటనే ఆమె బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

ఇలాంటి వ్యక్తులు జ్యూస్‌జాకింగ్‌ బాధితులేనని పోలీసులు చెబుతున్నారు.కాబట్టి జాగ్రత్త స్నేహితులారా? ఇలా ఎక్కడపెడితే అక్కడ ఛార్జింగ్ పెట్టే సాహసం చేయొద్దు.

తాజా వార్తలు