ఐపిఎల్ ఫ్యాన్స్ కు శుభవార్త..వారికి పండగే పండగ

కరోనా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది.చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

 Bcci To Allow Audience In The Second Schedule Of Ipl 2021 In Uae, Ipl, Good News-TeluguStop.com

ఇకపోతే క్రికెట్ కు కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.అయినప్పటికీ బీసీసీఐ మ్యాచ్ లు ఆడిస్తూ క్రికెట్ అభిమానులను సంతోష పెట్టింది.

ఆ సమయంలో క్రికెట్ ఆటగాళ్లకు కరోనా రావడంతో అన్ని ఫార్మాట్లను బీసీసీఐ నిలిపేసింది.ఆ తర్వాత నష్టాలు చవిచూడకుండా పకడ్బందీ ప్లాన్ వేసి ఐపిఎల్ ను నిర్వహించింది.

ప్రేక్షకులు లేకపోవడం వల్ల అంతగా బిజినెస్ జరగకపోవడంతో కొంత నష్టం వాటిల్లింది.దీంతో బీసీసీఐ టీ20లకు కూడా ఏర్పాట్లు చేసింది.

మొత్తం ఐపీఎల్ వల్ల 2000 కోట్ల వరకూ బిజినెస్ జరగనుంది.అందుకే ఐపిఎల్ ను నిర్వహించింది.

సగం మ్యాచులు జరిగాక మళ్లీ క్రికెటర్లలో కరోనా అలజడి రేపింది.దీంతో ఐపిఎల్ ను మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది.

సగం పూర్తైన ఐపిఎల్ మరో సగం ఇప్పుడు ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలోనే క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది.

సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా మొదలు కానున్న ఐపీఎల్ లోని మరికొన్ని మ్యాచ్‌లను చూసేందుకు ప్రేక్షకులకు అనుమతిస్తామని బీసీసీఐ వెల్లడించింది.

ఈ తరుణంలోనే సెప్టెంబర్ 16వ తేది నుంచి టికెట్లు అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టం చేసింది.https://222.iplt20.com/, PlatinumList.net ‌వెబ్‌సైట్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేసేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది.గత సంవత్సరం ఐపీఎల్ కూడా యూఏఈలో జరిగింది.

Telugu Audience, Bcci, Corona Effect, Ipl, Latest, Schedule-Latest News - Telugu

ఆ సమయంలో కరోనా వల్ల మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఉండేది కాదు.ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిపోవడం వల్ల తక్కువ సంఖ్యలోనే ప్రేక్షకులు హాజరైతే మ్యాచ్‌లు మరింత బాగుంటాయని బీసీసీఐ భావిస్తోంది.కరోనా సెకండ్ వేవ్ వల్ల ఐపీఎల్ 2021 అర్ధాంతరంగా నిలిచిపోయింది.

ఆ తర్వాత క్రికెట్ ఆటగాళ్లు కరోనా బారినపడటంతో బీసీసీఐ టోర్నమెంట్ ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌ను సెప్టెంబ‌ర్ 19వ తేది నుంచి యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube