అంతరించి పోతున్న అరుదైన పక్షి బట్టమేక పిట్ట.. దీని ప్రత్యేకతలు ఇవే

ఎన్నో అరుదైన జంతువులు, పక్షులు అంతరించిపోతున్న జాబితాలో చేరిపోతున్నాయి.ఒకప్పుడు వేలాదిగా ఉండే పక్షులు వందల సంఖ్యకు, మరికొన్ని కేవలం 10లోపు మాత్రమే ఉన్నాయి.

 Battameka Pitta Is A Rare And Endangered Bird Its Special Features Are These ,ra-TeluguStop.com

ఈ జాబితాలో ఓ అరుదైన పక్షి చేరిపోయింది.దానిని బట్టమేక పిట్టగా పిలుస్తారు.

పేరు విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది.ఏపీలోని నంద్యాల జిల్లా రోళ్లపాడులో ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది.

రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యంలో కొన్నేళ్ల క్రితం 33 బట్టమేక పిట్ట (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్) ఉండేవి.ఇప్పుడు ఆ సంఖ్య మూడుకు తగ్గిందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

తీవ్ర అంతరించిపోతున్న ఈ పక్షులు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయని, రోళ్లపాడు అభయారణ్యంలో కేవలం మూడు పక్షులు మాత్రమే మిగిలాయని ఆత్మకూర్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి, డిప్యూటీ కన్జర్వేటర్ వెంకటేష్ సంబంగి తెలిపారు.

పతనానికి గల కారణాలను వెంకటేష్ వివరించారు.

వ్యవసాయ విధానంలో మార్పు రావడం, వేటగాళ్లు ఉచ్చు పన్నడం వంటి కారణాలు ఈ పక్షులు అంతరించిపోతున్నాయన్నారు.పక్షి అభయారణ్యం కేవలం 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండదని, కానీ చాలా విస్తీర్ణంలో ఇవి తిరుగుతాయని, కీటకాలను తింటాయని చెప్పారు.

పొలాల్లో విపరీతమైన క్రిమిసంహారక మందుల వాడకం ఒక కారణమని పేర్కొన్నారు.కీటకాలను తినే సమయంలో పక్షులు పురుగు మందులు తింటాయి.

దీని కారణంగా అనేక పక్షులు చనిపోయాయని వెంకటేష్ తెలిపారు.ఇటీవల కాలంలో పిల్లులు లేదా నక్కలు వంటి వేటాడే జంతువుల సంఖ్య కూడా పెరిగిందని, ఫలితంగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ తగ్గిపోతున్నాయని వివరించారు.పక్షులను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు అటవీ అధికారులు ఆరుగురు బర్డ్ వాచర్లను నియమించారు.రోళ్లపాడు అభయారణ్యం చుట్టూ భూమిని సేకరించి కంచెలు ఏర్పాటు చేసేందుకు ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ గ్రీన్‌కోతో చర్చలు జరుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube