కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కుమిలి ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కాగా మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు.శబరిమలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.







