హీరోయిన్ సొనాలి సెగల్.ఈ పేరు వినగానే చాలామందికి ప్యార్ కా పంచ్ నామా సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది.
ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందం నటనతో యూత్ ని కట్టిపడేసింది.మరి ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందానికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు చేస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.ఈమె లవ్ లో ఉంది అంటూ బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కానీ ఈమె మాత్రం బయటకు నేను లవ్ లో లేను సింగలే అని చెబుతోంది.కానీ ఈ ముద్దుగుమ్మ ఆశేల్ ఎల్ సంజనాని అనే ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే అతను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని ఎంటర్ ప్రెన్యూర్ అని తెలుస్తోంది.కానీ అతడు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో స్నేహం చేస్తూ ఉంటాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.
వీరిద్దరూ ఇప్పటినుంచి కాదని గత నాలుగు ఐదు ఏళ్లుగా డేటింగ్ లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.నాలుగు ఐదు ఏళ్ల నుంచి వీరిద్దరి ప్రేమాయణం నడుస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయం బయటకు తెలియకూడదు అని ఈ జంట చాలా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.అందుకే ఈ జంట కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.వారి డేటింగ్ విషయాన్ని ఈ జంట ఎంతో గోప్యంగా ఉంచాలనుకుంటోందట.మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలపై సొనాలి సెగల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.కాగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నూరాని చెహరే సినిమాలో నటిస్తోంది.ఇందులో నవాజుద్దీన్, నుపూర్ సనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.







