భార్య కొడుతుందంటూ  పోలీసులను ఆశ్రయించిన భర్త చివరికి....

సాధారణంగా ఎక్కడైనా భర్తలు భార్యలు హింసిస్తుంటే చేస్తుంటే కాపాడండి అంటూ భార్యలు పోలీసులను ఆశ్రయించిన సంఘటనను చూస్తుంటాం.

కానీ హైదరాబాదులో మాత్రం ఇందుకు భిన్నంగా ఒక సంఘటన చోటు చేసుకుంది.

ఏకంగా ఓ భర్త తన భార్య కొట్టే దెబ్బలను తట్టుకోలేక పోతున్నానని తన భార్య నుంచి తనను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.వివరాల్లోకి వెళితే హైదరాబాదులోని బషీరాబాద్  మండలం జీవన్గి ప్రాంతంలో షాదుల్లా మరియు అతను భార్య నివాసం ఉంటున్నారు.

అయితే పెళ్ళైన మొదట్లో సంసారం ఎంతో సుఖ సంతోషాలతో సాగిపోయింది.అయితే ఏమయిందో ఏమో కానీ ఈ మధ్య వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం వరకూ ఈ గొడవలు వచ్చాయి.అయితే గొడవల్లో సాధారణంగా మగవాళ్ళు ఆడవాళ్ళని కొడుతుంటారు.

Advertisement
Bashirabad Shadulla Kalikalam-భార్య కొడుతుందంటూ

కానీ ఈ వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో మాత్రం షాదుల్లాని తన భార్య కొట్టింది.దీంతో షాదుల్లా ఆ దెబ్బలు తాళలేక తన భార్య నుంచి రక్షణ కల్పించాలంటూ వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.

Bashirabad Shadulla Kalikalam

దీంతో పోలీసులు వెంటనే అతడి భార్యను పిలిపించి విచారించగా ఈ గొడవలో తన భర్తపై చేయి చేసుకున్నట్లు అతడి భార్య ఒప్పుకుంది.దాంతో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి పంపించారు.అయితే పోలీసులు ఎంత ధైర్యం చెబుతున్నప్పటికీ అతడు మాత్రం బిక్కుబిక్కుమంటూ నే తన భార్య వెనకాల వెళ్ళిపోయాడు.

దీంతో కలికాలం అంటూ అక్కడున్న వారంతా అనుకుంటున్నారు. .

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు