సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెబుతున్న బ్యాంకులు.. !

సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు గుడ్ న్యూస్ చెబుతున్నాయి.అధిక వడ్డీని పొందే స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో చేరేందుకు గడువును బ్యాంకులు పెంచాయి.

 Banks Telling Good News-to Senior Citizen  Banks, Telling, Good News, Senior Cit-TeluguStop.com

కాగా గత ఏడాది మే నెలలో 60 సంవత్సరాలు దాటిన వారికోసం బ్యాంకులు స్పెషల్ FD లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

అయితే వీటిలో చేరేందుకు మార్చి 31.2021 ని ఆఖరి తేదీగా నిర్ణయించాయి.కాగా తాజాగా ఈ గడువును బ్యాంకులు జూన్ 30 వరకు పొడిగించాయి.

ఇప్పటి వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు మాత్రమే సీనియర్ సిటిజన్ల కోసం స్పెషల్ FD స్కీమ్‌లను ప్రవేశపెట్టాయి.

తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సీనియర్ సిటిజన్ల కోసం స్పెషల్ FD పథకాన్ని ప్రవేశపెట్టింది.5-10 సంవత్సరాల గడువుతో ఉండే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల పై బ్యాంక్ ఆఫ్ బరోడా అదనంగా 1 శాతం వడ్డీ రేటును అందిస్తున్నట్లుగా పేర్కొంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube