జులైలో పట్టాలెక్కబోతున్న "బంగార్రాజు" !

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.

ఆయన కొడుకులు కూడా హిట్ కొట్టడానికి నానాపాట్లు పడుతుంటే ఈయన మాత్రం మంచి హిట్స్ అందుకుని దూసుకు పోతున్నాడు.

ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

తీవ్రవాదం ఎన్ ఐ ఏ ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది.హైదరాబాద్ లో జరిగిన బాంబు పేలుళ్ల ఆధారంగా వైల్డ్ డాగ్ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమాలో నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు.ఏప్రిల్ 2 న విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.

Advertisement

ఈ చిత్రాన్ని ఆశిషోర్ సోలమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా థియేటర్స్ లోనే కాదు ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యి మంచి వ్యూస్ సాధించి దూసుకు పోతుంది.

నాగార్జున చాలా రోజుల తర్వాత హిట్ కొట్టడంతో మంచి హుషారుగా ఉన్నారు.

అదే జోష్ లో నాగార్జున మరొక సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

ఆ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేసాడు.అందులో బంగార్రాజు పాత్ర ఒకటి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.ఇప్పుడు అదే పేరుతొ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించారు.కానీ మధ్యలో కొన్ని కారణాల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై నాగార్జున స్పందించారు.ఈ సినిమాను జులై లో సెట్స్ మీదకు తీసుకెళ్ళబోతున్నామని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా కథ గురించి చర్చించుకుంటున్నట్టు నాగ్ తెలిపారు.

తాజా వార్తలు