బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలంగాణ మహిళా కమిషన్ స్పందించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని తెలిపింది.
మహిళా కమిషన్ లేఖపై బండి సంజయ్ స్పందించారు.ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పారు.
కానీ బడ్జెట్ సమావేశాల కారణంగా హాజరుకాలేనని కమిషన్ కు తెలిపారని సమాచారం.ఈ క్రమంలోనే ఈనెల 18న హాజరు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.