తెలంగాణలో బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని భావించిన బీజేపీ( BJP ) అనూహ్యంగా ఎన్నికల ముందు బోల్తా పడిన సంగతి తెలిసిందే.పార్టీలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు పెరిగి నేతల మద్య ఐక్యత లేకపోవడంతో ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.
అయితే ఆ మద్య తెలంగాణలో బాగా పుంజుకున్న బీజేపీ అనూహ్యంగా డీలా పడడానికి ప్రధాన కారణం అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని( Bandi Sanjay ) తప్పించడమే అనేది చాలమంది చెప్పే మాట.బండిని అద్యక్ష పదవి నుంచి తప్పించిన తరువాత పార్టీలో మునుపటి జోష్ కొరవడింది.నేతల మద్య కూడా పరస్పర విభేదాలు పెరుగుతూ వచ్చాయి.

ముఖ్యంగా ఈటెల రాజేందర్ మరియు బండి సంజయ్ మద్య కోల్డ్ వార్ చర్చనీయాంశం అవుతూ వచ్చింది.అంతే కాకుండా కొత్తగా అధ్యక్ష బాద్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి( Kishan Reddy ) సైతం పార్టీని ముందుకు నడిపించడంలో తడబడుతూనే వచ్చారు.ఈ నేపథ్యంలో పార్టీకి పునఃవైభవం తెచ్చేందుకు బీజేపీ అధిష్టానం మళ్ళీ బండి వైపు చూస్తుందా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఎన్నికల రిజల్ట్స్ తో చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు మళ్ళీ బండి సంజయ్ కే పార్టీ బాద్యతలు అప్పగించాలనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది.

అయితే అనూహ్యంగా తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన సమయంలో తీవ్ర అసంతృప్తికి లోనైనా బండి.ఆ తరువాత మళ్ళీ అధ్యక్ష పదవి ఇస్తే తీసుకొనని ఖరాఖండీగా చెబుతూ వచ్చారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ బండికి అధ్యక్ష బాద్యతలు అప్పగిస్తే ఆయన సుముకత చూపిస్తారా అనేది కూడా సందేహమే.
కాగా వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీకి సరైన నాయకత్వం ఎంతైనా అవసరం.అందుకే పార్టీ అధిష్టానం మళ్ళీ బండి వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది.
అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్న బండి.పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections ) పోటీ చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో బండి అధ్యక్ష బాద్యతలు భుజాన వేసుకొని మునుపటి దూకుడు కొనసాగిస్తారా ? లేదా తనకే పదవి వద్దని ఇదే దొరణిలోనే ఉంటారా అనేది చూడాలి.