కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay ) రైతు దీక్ష చేపట్టారు.ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
అకాల వర్షాల వలన రైతులు నష్టపోయినా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు.అదేవిధంగా రైతు భరోసా( Rythu Bharosa ) ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
దాంతో పాటు రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు.ఈ క్రమంలోనే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలిపారు.