సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాయి.ఇలా కొన్ని కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని చెప్పడంలో సందేహం లేదు.
ఇలాంటి కాంబినేషన్లలో నందమూరి నటసింహం బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటని చెప్పాలి.వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు రాగ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావడం విశేషం.
బోయపాటి బాలయ్య కాంబినేషన్లో సింహా లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలను సృష్టించిందో మనకు తెలిసిందే.
బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటించి సందడి చేశారు.ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నటువంటి ఈ సినిమాను తాజాగా గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రత్యేకంగా ప్రదర్శింపజేశారు.
ఈ క్రమంలోనే చిత్ర బృందం సైతం హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఇతర చిత్ర బృందం పెద్ద ఎత్తున సందడి చేయడమే కాకుండా అఖండ సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆఖండ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి జరిగాయని సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుంది అనే విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ నిర్ణయించాల్సి ఉంటుంది అంటూ బాలకృష్ణ ఈ సందర్భంగా సీక్వెల్ గురించి క్లారిటీ ఇవ్వడంతో ఒకసారిగా నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.