బాలయ్య బాబుకి విలన్ గా శ్రీకాంత్ ఫిక్స్!

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి తరువాత సైడ్ విలన్ పాత్రలు చేస్తూ హీరోగా మారిన నటుడు శ్రీకాంత్.

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న శ్రీకాంత్ కెరియర్ హీరోగా ఈ మధ్య పూర్తిగా గాడి తప్పింది.

అతను హీరోగా చేసిన సినిమాలు కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్నాయి.దీంతో ఈ మధ్య హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకొని పెద్ద హీరోల సినిమాలలో కీలక పాత్రలు చేస్తున్నాడు.

అలాగే ప్రస్తుతం చదరంగం అనే వెబ్ సిరీస్ లో పవర్ ఫుల్ పొలిటీషియన్ గా కనిపిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు విలన్ గా టర్న్ తీసుకొని కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్న శ్రీకాంత్ ఇప్పటికే చైతుకి విలన్ గా యుద్ధం శరణం అనే సినిమాలో నటించాడు.

అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో శ్రీకాంత్ కి సరైన పాత్రలు రాలేదు.ఈ లోపు మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పుడు విలన్ గా గ్రాండ్ గ్రాండ్ గా కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి కావాల్సిన సినిమా శ్రీకాంత్ కి దొరికింది.లెజెండ్ సినిమాతో జగపతిబాబుని విలన్ గా పరిచయం చేసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్యబాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో శ్రీకాంత్ ని విలన్ గా ఫైనల్ చేశారు.

ఇక ఈ విషయాన్ని అఫీషియల్ గా ద్రువీకరించడం మిగిలి ఉంది.బోయపాటి సినిమాలో విలన్ అంటే ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దీంతో ఈ సినిమాతో శ్రీకాంత్ ఇమేజ్ మారిపోవడం పక్కా అనే మాట టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest
Advertisement

తాజా వార్తలు