కృష్ణా జలాలపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

సినీనటుడు హిందూపురం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కృష్ణా జలాల నీటి వివాదం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా జలాల పరిరక్షణ కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

కృష్ణా నికర జలాలని సీమ కోసం ఉపయోగించాలని ప్రభుత్వాలకు సూచించారు. సీమకు జలాల కోసం హర్యాన తరహాలో పోరాటం చేయాలని అవసరమైతే ఢిల్లీకి వెళ్లి.

ఉద్యమించాలని బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక నాటి రతనాల సీమ నేడు కరువు సీమగా మారిపోయింది అని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఒక నాడు సీమ ప్రాంతం కోసం ఎన్టీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు.వైసీపీ ప్రభుత్వానికి కనీసం అందమైన నుండి చెరువులకు నీరు అందించే ఆలోచన కూడా లేదని.

Advertisement

మండిపడ్డారు.ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రీతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

గోదావరి పెన్నా అనుసంధానం జరగాలని సూచించారు.ఎన్టీఆర్ హయాంలో ఎంతో అభివృద్ధి రాయలసీమలో జరగగా ప్రస్తుతం రాజకీయ.

కక్షలకి కేరాఫ్ అడ్రస్ గా మారిందని.వెనకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది అని పేర్కొన్నారు.

వ్యవసాయం లాభసాటిగా మారేలా ఇక్కడ ప్రజల జీవితాలు అభివృద్ధి చెందిన ప్రభుత్వాలు కృషి చేయాలని బాలకృష్ణ స్పష్టం చేశారు.

ఓ వైపు కలెక్టరేట్ లో కీలక సమావేశం.. మరోవైపు ఫోన్లో రమ్మీ ఆడుతున్న అధికారి
Advertisement

తాజా వార్తలు