ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు బాల‌య్య గుడ్ బై..!

ప్ర‌ముఖ సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారా ? 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీ చేయ‌రా ? అంటే ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అవున‌నే ఆన్స‌ర్ విన‌వస్తోంది.

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో త‌న తండ్రి ప్రాథినిత్యం వ‌హించిన హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన బాల‌య్య తొలి మూడేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డంతో పాటు అభివృద్ధి విష‌యంలోనే బాగానే కాన్‌సంట్రేష‌న్ చేశారు.

అయితే బాల‌య్య ఇటీవ‌ల సినిమాల షూటింగ్‌ల‌తో బిజీగా ఉంటూ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై శీత‌క‌న్ను వేశారు.బాల‌య్య ఎక్క‌డంటూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఫ్ల‌కార్డులు కూడా ప్ర‌ద‌ర్శించే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది.

ఇక బాల‌య్య పీఏపై చెల‌రేగిన అసంతృప్తితో పీఏ శేఖ‌ర్‌ను కూడా త‌ప్పించారు.ఇదిలా ఉంటే బాల‌య్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి హిందూపురం నుంచి పోటీ చేసే ఉద్దేశంలో లేర‌ట‌.బాల‌య్య 2019 ఎన్నిక‌ల త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ‌లు టీడీపీలో వినిపిస్తున్నాయి.2019 ఎన్నిక‌ల్లో లోకేశ్ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం దాదాపు ఖ‌రారైపోయింది.లోకేశ్ మ‌రో ఆప్ష‌న్‌గా కృష్ణా జిల్లా పెన‌మ‌లూరును కూడా ఎంచుకున్నా బాల‌య్య రాజ్య‌స‌భ‌కు వెళ్లాల‌న్న నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబుకు చెప్ప‌డం, ఆయ‌న ఓకే చెప్ప‌డంతో ఇప్పుడు లోకేశ్ హిందూపురం నుంచి బ‌రిలో దిగేందుకు ప్లాన్ అంతా రెడీ అయిన‌ట్టే టాక్‌.

ఇక బాల‌య్య ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కంటే రాజ్య‌స‌భ‌కే వెళ్లాల‌న్న ఆస‌క్తితో ఉన్నారు.దీంతో నంద‌మూరి ఫ్యామిలీకి కంచుకోట‌గా ఉంటోన్న హిందూపురం బ‌రిలో లోకేశ్‌ను దింపేందుకు బాబు స్కెచ్ గీసేశార‌ట‌.

Advertisement
కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి

తాజా వార్తలు