మోడ్రన్ దేవుడి పాత్రలో బాలయ్య.. వర్కౌట్ అయ్యేనా?

మన తెలుగు ప్రేక్షకులు డిఫెరెంట్ గా ఆలోచిస్తారు.వారి అభిరుచులు మిగతా ఇండస్ట్రీల వారు కూడా మెచ్చుకునే విధంగా ఉంటాయి.

మన ఇండస్ట్రీ లో మొదటి నుండి పౌరాణిక సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తూ ఉండడంతో అలంటి సినిమాలే ఎక్కువ తీశారు.పౌరాణిక సినిమాల్లో ప్రధాన నాయకుడు భగవంతుడే.

మరి అలాంటి పాత్రలో నటించే వ్యక్తిని చూడగానే ప్రేక్షకులకు వెంటనే భక్తి భావం కలగాలి.మరి అలా కలగాలంటే హావభావాలు కానీ.

నటన, వేషధారణ, లుక్స్ పరంగా వైవిధ్యంగా ఉండాలి.మరి అలా కనిపించే నటుల్లో ముందుగా సీనియర్ ఎన్టీఆర్ మనకు గుర్తుకు వస్తారు.

Advertisement

ఆయన తర్వాత ఆయన వారసుడు బాలకృష్ణ ఇలాంటి పాత్రలు చేసి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించు కున్నాడు. బాలకృష్ణ ఇప్పటి వరకు అలాంటి పౌరాణిక పాత్రలు చాలానే చేసాడు.

అయితే ఇది వరకు లాగా కాకుండా దేవుడిని కూడా మోడ్రన్ గా చూపించడం మొదలు పెట్టారు.ఎలా చూపించిన మన తెలుగు ప్రేక్షకులకు నచ్చితే బాగా ఆదరిస్తారు.ఇలా మోడ్రన్ దేవుడిగా పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమాలో కనిపించి అందరిని మెప్పించాడు.

ఇందులో పవన్ మోడ్రన్ శ్రీకృష్ణుడుగా నటించి మెప్పించాడు.తాజాగా బాలకృష్ణ ను కూడా ఒక రీమేక్ సినిమా కోసం అలాంటి మోడ్రన్ దేవుడి పాత్ర కోసం అడిగారట.

ఇప్పటి వరకు బాలకృష్ణ పౌరాణిక దేవుడిగా చేసాడు కానీ మోడ్రన్ దేవుడిగా కనిపించలేదు.మరి అలా చేయడానికి బాలకృష్ణ ఒప్పుకుంటాడా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా చర్చించు కుంటున్నారు.

బాబు ను వారు నమ్మడం లేదనేగా జగన్ ధీమా ? 
ఆర్య టైమ్ లో అల్లు అర్జున్ కి సుకుమార్ కి ఆ సీన్ విషయం లో గొడవ జరిగిందా..?

ప్రెసెంట్ బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా స్టార్ట్ చేసాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇందులో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది.

Advertisement

ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

తాజా వార్తలు