వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ అవుతోందా.. బాలయ్య బాబీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారా?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు( Balayya Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలో అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.కాగా బాలయ్య బాబు తన గత మూడు సినిమాలతో హ్యాట్రిక్ ను అందుకున్న విషయం తెలిసిందే.

అలా అటు రాజకీయపరంగానే కాకుండా ఈ సినిమాల పరంగా కూడా బాలయ్య బాబు మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు.ఇకపోతే బాలయ్య బాబుతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు రెడీగా ఉన్నారు.

ముఖ్యంగా మాస్ దర్శకుడు దొరికితే బాక్సాఫీస్( box office ) షేక్ అవడం ఖాయం ఆనందంలో ఎటువంటి సందేహం లేదు.బాలయ్య బాబుకు ఎమోషనల్ సినిమాల కంటే ఎక్కువగా మాస్ సినిమాలు బాగా సెట్ అవుతాయని చెప్పవచ్చు.ఈ మధ్యకాలంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి ( Simha, Legend, Akhanda, Veerasimha Reddy )సినిమాలు చూస్తే మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ కాంబో లు గుర్తుకు వస్తాయి.

Advertisement

గత ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో గోపీచంద్ మలినేని బాలయ్య తో మాస్ హిట్ కొట్టాడు.వీరసింహారెడ్డి మూవీలో బాలయ్య మాస్ లుక్స్ పై నందమూరి అభిమానులే కాదు మాస్ ఆడియన్స్ అంతా తెగ ఇంప్రెస్స్ అయ్యారు.

వీరసింహారెడ్డి సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అవడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు.

ఇప్పుడు మరోసారి వీరసింహారెడ్డి కాంబో రిపీట్ కాబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వీరసింహారెడ్డి తర్వాత గోపిచంద్ మలినేని రవితేజ తో సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది.కానీ రవితేజని తప్పించి బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ని మైత్రి మేకర్స్ తెరపైకి తీసుకొచ్చారు.

బాలయ్య కూడా బాబీ తో NBK109 చేస్తున్నారు.తర్వాత ఆయన అఖండ 2 చెయ్యాల్సి ఉంది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

మరి ఎప్పుడు గోపీచంద్ బాలయ్య బాబుతో మూవీ చేస్తారో, వీరసింహారెడ్డి కాంబో ఎప్పటికి రిపీట్ అవ్వుద్దో అని నందమూరి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే మరోసారి బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు