బాలయ్య దూకుడు పై టీడీపీలో అనుమానాలు ?

హిందూపురం ఎమ్మెల్యే చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ వ్యవహారంపై ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.

ఆయన గత కొంత కాలంగా టీడీపీలో మళ్లీ యాక్టివ్ గా ఉంటూ రావడమే కాకుండా, టిడిపి గురించి, ఎన్టీఆర్ గురించి అనేక అంశాలను అనేక ఛానెళ్ల కు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా చెప్పుకుంటూ వస్తున్నారు.

అంతేకాకుండా తన సొంత ఇమేజ్ పెరిగే విధంగా వ్యవహరిస్తున్నారు.ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య ఎప్పటికైనా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేది తానేనంటూ వ్యాఖ్యానించడం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది.

బాలయ్య ఆ విధంగా వ్యాఖ్యానించడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి అనే అనుమానాలు ఇప్పుడు తెలుగుతమ్ముళ్లు వ్యక్తమవుతోంది.ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు వయసు రీత్యా పెద్దగా యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు.

ఏపీలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న చంద్రబాబు హైదరాబాద్ లో ఎక్కువ సమయం గడిపేందుకు కేటాయిస్తున్నారు.తన రాజకీయ వారసుడు లోకేష్ ను రాజకీయంగా మరింత యాక్టివ్ చేద్దామని చూస్తున్నా, అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

Advertisement

అలాగే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవిని కూడా భర్తీ చేయాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి.

కానీ ఇప్పటి వరకు ఆయన ఆ పదవిలో భర్తీ చేసే విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు.

టిడిపి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నా, పార్టీని యాక్టివ్ గా నడిపించగలిగే సత్తా ఉన్న సమర్ధులైన నాయకులు అవసరం ఇప్పుడు టిడిపికి చాలా అవసరం.ఈ నేపథ్యంలో బాలయ్య దూకుడు ప్రదర్శిస్తు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన టిడిపిలో ఏదో కీలక పదవి సంపాదించడమే కాకుండా, మొత్తం పార్టీని తన చేతుల్లోకి తీసుకునే విధంగా ఇప్పుడు సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు.ఇక బాలయ్య పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు తనకు అత్యంత సన్నిహితులైన వారందరినీ పిలిచి వేడుక చేసుకున్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ వంటి వారిని కూడా బాగా దగ్గర చేసుకుంటున్నారు.ఈ పరిణామాలు చూస్తుంటే బాలయ్య రాజకీయంగా ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

గత టీడీపీ ప్రభుత్వం లోనే బాలకృష్ణ ఓ సందర్భంలో వ్యవహరించిన తీరును ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు.

Advertisement

చంద్రబాబు విదేశాలకు వెళ్లిన సందర్భంలో బాలయ్య చంద్రబాబు కుర్చీలో కూర్చోవడం పెద్ద దుమారాన్ని రేపింది.ఇక ఆ తర్వాత పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్టుగా కనిపించకపోయినా, ఇప్పుడు టిడిపిలో తలెత్తుతున్న పరిణామాలను బట్టి ఆయన మళ్ళీ యాక్టివ్ గా ఉంటూ పార్టీని లీడ్ చేయాలన్న విధంగా వ్యవహరిస్తున్నట్లుగా అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.

తాజా వార్తలు