తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కి తరలి వచ్చేందుకు సీనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రయత్నించారు.ఆయన ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో టాలీవుడ్ కి చెందిన ప్రముఖులను చెన్నై నుండి హైదరాబాద్ కి ఆహ్వానించడం తో పాటు వారికి చాలా వసతులు కల్పించారు.
స్టూడియోల నిర్మాణం కు భూమి ఇవ్వడం తో పాటు చాలా రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.ఇతర నిర్మాతలు మరియు హీరోలు మాత్రమే కాకుండా తాను స్టూడియో నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ కేవలం స్టూడియో నిర్మాణం చేపట్టడం మాత్రమే కాకుండా హైదరాబాదు లో సినిమా థియేటర్ లు కూడా కట్టించారు.
హరికృష్ణ వాటి యొక్క నిర్వహణ చూసుకునే వారు అని అప్పట్లో ప్రచారం జరిగేది.
నందమూరి ఫ్యామిలీ కి చెందిన తారకరామా సినిమా థియేటర్ గత కొన్నాళ్లుగా పని చేయకుండా ఉంది.అది ఇప్పుడు పునః ప్రారంభం కాబోతుంది.తారకరామా సినీప్లెక్స్ ను ఏషియన్ వారు తీసుకుని పునః నిర్మించారు.దాంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆదరణ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నేడు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యం లో ఈ థియేటర్ ఓపెన్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

అవతార్ సినిమా తో నందమూరి వారి కొత్త థియేటర్ మనుగడలోకి రాబోతుంది.అద్భుతమైన విజువల్ వండర్ ను తారకరామా సినీప్లెక్స్ లో చూసేందుకు స్థానిక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సంక్రాంతి కి ఈ థియేటర్లో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రదర్శించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఆ సమయంలో నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తారట థియేటర్ను ఈ తరం టెక్నాలజీకి అనుగుణంగా మార్చినట్లు తెలుస్తోంది.మొత్తానికి నందమూరి వారి తారకరామా సినిమా థియేటర్ మళ్ళీ ప్రారంభం అవ్వడం ఆ ఫ్యామిలీ యొక్క అభిమానులకు ఆనందం కలిగిస్తుంది.







