బాలయ్య పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకి కారణం ఇదే     2018-02-16   01:33:41  IST  Bhanu C

బాలకృష్ణ ఆయనో అగ్ర హీరో..సినిమా ఇండస్ట్రీలో పెద్ద తలకాయి..హిందూపురం నుంచీ టిడిపి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. .బాలయ్యకి మొదటినుంచి దూకుడుగా మాట్లడటం అలవాటు..చేయి చేసుకోవడం కూడా అయితే అది కోపం ఉన్నంతవరకేలెండి..కోపం తగ్గితే మళ్లీ సరదాగానే ఉంటారు..అయితే అనుకోకుండా బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ మరియు రాజకీయ వర్గాలలో సంచలనం కలిగిస్తోంది…అంతగా సంచలనం కలిగించడానికి బాలయ్య బాబు కామెంట్స్ చేసింది ఎవరో సాధారణం వ్యక్తి మీద కాదు..తెలుగుదేశానికి బ్యాక్ బోన్ గా ఉన్న పవన్ కళ్యాణ్ మీద..ఇంతకీ పవన్ ని బాలయ్య ఏమన్నాడంటే.

బాలకృష్ణ నిన్న వైజాగ్ వచ్చారు ..అక్కడికి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో బాలయ్య పై ప్రశ్నల వర్షం కురిపిచారు విలేకరులు..ఆ ప్రశ్నలలో ఒకటి..ఏపీకి ప్రత్యేక హోదా కోసం జేఎఫ్ఎఫ్‌సీ ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సమయంలో “పవన్” పోరాటంపై మీ స్పందన ఏంటని ఓ విలేఖరి అడుగగాబాలయ్య చెప్పిన ఆన్సర్ కి ఒక్కసారిగా అవ్వాక్కయ్యారు విలేఖరులు…

పవన్ కళ్యాణ్ నా..? తానెవరో నాకు తెలియదే అంటూ సమాధానం చెప్పి ఒక్కసారిగా కారులుకి వెళ్ళిపోయారు..దాంతో అక్కడ ఉన్నవారు నోళ్ళు వెళ్ళబెట్టారు…అయితే బాలయ్య వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో అంటే గాటుగా కామెంట్స్ వస్తున్నాయి..2014 లో టిడిపికి అండగా నిలిచి అధికారంలోకి వచ్చేలా చేసిన పవన్ కళ్యాణ్ ఎవరు అని అంటున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్న అధికారం మా పవన్ వల్ల వచ్చిందే అంటూ పవన్ ఫ్యాన్స్ తెగ రెచ్చిపోతున్నారు..ఏరు దాటాకా తెప్ప తగలేయడం మీకు ఉన్న అలవాటేకదా అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు..అయితే బాలయ్య ఎందుకు అల అనవాల్సి వచ్చిందో తెలిసింది..

బాలయ్య బాబు అప్పటికే తనకి సంభందించిన పనుల నిమ్మిత్తం చాల అలసిపోయి ఉన్నాడట..ఎంతో చికాకులో ఉన్నా సరే విలేఖరులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూనే ఉన్నాడు అయితే..విలేఖరులు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ బాలయ్యకి విసుగు తెప్పిస్తున్న తరుణంలో ఆ వ్యాఖ్యలు చేశారు తప్ప మరేమీ కాదని బాలయ్య సన్నిహితులు తెలిపారు..