బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసుకోవడానికి బాలయ్య రెడీ అవుతున్నాడు.

గతకొంత కాలంగా సైరన హిట్ లేక సతమతమవుతున్న బాలయ్యకు ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందించాలని చూస్తున్నాడు బోయపాటి.ఈ సినిమా కోసం అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేసి తెరకెక్కించే పనిలో బోయపాటి బిజీగా ఉన్నాడు.

కాగా జూన్ 10న బాలయ్య తన పుట్టినరోజును జరుపుకోనున్నాడు.ఈ సందర్భంగా బాలయ్య సినిమాకు సంబంధించి ఏదైనా అప్‌డేట్ ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా బాలయ్య తన బర్త్‌డే గిఫ్టును ఇప్పటికే రెడీ చేసినట్లు తెలుస్తోంది.తన తండ్రి ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ చిత్రంలోని ‘‘శివశంకరీ.

Advertisement

’’ అనే పాట బాలయ్యకు ఎంతో ఇష్టమట.ఇప్పుడు ఈ పాటను తన వాయిస్‌లో వినిపించేందుకు బాలయ్య రెడీ అయ్యాడు.

ఇప్పటికే సింగర్ సింహా సహాయంతో ఈ పాటను రికార్డు కూడా చేశాడట బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను జూన్ 10న రిలీజ్ చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు.ఈ పాట తనకు ఎందుకు చాలా ఇష్టమనే విషయాన్ని కూడా బాలయ్య ఆ రోజు తెలుపనున్నాడట.

మొత్తానికి బాలయ్య మరోసారి సింగర్‌గా మారి తనకు ఇష్టమైన పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.మరి బాలయ్య ఇలాంటి పాటను ఎలా పాడాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక బోయపాటి శ్రీనుతో చేస్తున్న చిత్రంలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో మనకు కనిపించనున్నాడు.

వైట్ హౌస్ గేట్‌ను ఢీకొట్టిన వ్యక్తి.. కట్ చేస్తే మృతి..?
Advertisement

తాజా వార్తలు